ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)
ఏదులాపురం :
ఖమ్మం జిల్లా జనసేన పార్టీ మున్సిపల్ కోఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు అభ్యర్థి కొమ్ము లక్ష్మి, 7వ వార్డు అభ్యర్థి జార్పుల నీలిమ, 27వ వార్డు అభ్యర్థి బాణోత్ రఘు, 28వ వార్డు అభ్యర్థి దండి సుధాకర్, 29వ వార్డు అభ్యర్థి హనుమంతు మౌనికలకు అధికారికంగా బి ఫార్ములు అందజేశారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గ నాయకులు బండారు రామకృష్ణ, యసంనేని అజయ్, తుడం ఉత్తమ్ రాజు, బనోత్ దేవేందర్, షేక్ హసీనా, రమణ కుమార్, అఖిల్, గంగాధర్, విజయ్, రాకేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
రామ కృష్ణ మాట్లాడుతూ ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా జనసేన పార్టీ అభ్యర్థులు కృషి చేస్తారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ప్రజల మద్దతు తప్పకుండా లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.



