ఎస్ వి కి అసత్యప్రచారాల ముఠా పై కఠిన చర్యలు తీసుకోండి –తాతంశెట్టి నాగేంద్ర, జనసేన రాష్ట్ర కార్యదర్శి
రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా SP శ్రీ కునుగులి ధీరజ్ గారిని ఈ రోజు ఉదయం 12 గంటలకు జనసేన రాష్ట్ర కార్యదర్శి శ్రీ తాతంశెట్టి నాగేంద్ర మరియు జనసేన సీనియర్ నాయకులు మర్యాద పూర్వకంగాకలిశారు.. ఈ సందర్బంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తులు పార్టీ అని చెప్పి పార్టీకి నష్టం కలిగించే వారిమీద మరియు ప్రత్యక్షంగా fb ఐడిలతో మరియు fake లతో పార్టీకి నష్టంకలిగేలా నాయకుల మీద అసత్య ఆరోపణలతో వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రకాల ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది, గతంలో రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదులు కూడా SP గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.. SP గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి.. నివేదిక తెప్పించుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జోగినేని మణి, పగడాల చంద్రశేఖర్, ఆలం రమేష్, పగడాల వెంకటేష్, ఆనాల సునీల్ తదితరులు పాల్గొన్నారు.


