Saturday, 28 February 2026
  • Home  
  • ఎస్.కె.ఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం
- గూడూరు

ఎస్.కె.ఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం

గూడూరు @ 28 ఫిబ్రవరి స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, కార్యక్రమ నిర్వాహకులు శ్రీధర్ శర్మ, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎక్సైజ్ ఎస్సై పి. మహేష్, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భారతదేశపు ఘనమైన శాస్త్రీయ వారసత్వాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలిపిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ సి.వి. రామన్ అని, ఫిబ్రవరి 28న ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రామన్ జీవిత విశేషాలను కొనియాడారు. 1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన రామన్ చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటికీ, అన్వేషణే శ్వాసగా పరిశోధనల పట్ల తపన తో కలకత్తాలోని ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ లో రాత్రింబవళ్లు శ్రమించి అద్భుత ప్రయోగాలు చేశారని, సముద్రపు నీరు నీలిరంగులో ఎందుకు కనిపిస్తుందనే జిజ్ఞాసతో ప్రారంభమైన ఆయన అన్వేషణ ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు దారితీసిందని, కాంతి కిరణాలు పారదర్శకమైన ఘన, ద్రవ, వాయు మాధ్యమాల గుండా ప్రసరించినప్పుడు వాటి స్వభావంలో వచ్చే మార్పును ఆయన నిరూపించారని, ఈ ఆవిష్కరణ రసాయన శాస్త్రం, స్పెక్ట్రోస్కోపీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసిగా రామన్ రికార్డ్ సృష్టించాడని, దేశ అత్యున్నత పురస్కా రమైన భారతరత్నతో పాటు లెనిన్ శాంతి బహుమతినీ పొందారని, బెంగళూరులో ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ స్థాపించి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కృషి చేశారని, విజ్ఞాన శాస్త్రం నిత్యజీవితంలో భాగమని, రామన్ వంటి మహనీయుల స్ఫూర్తితో నేటి విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు ప్రయత్నం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులుతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు వారి ఆధ్వర్యంలో ‘మత్తుపదార్థాలు – అవగాహన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పి. మహేష్ నేటి యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటికి దూరంగా ఉండాలని జీవిత విలువలు గురించి విద్యార్థినీ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

గూడూరు @ 28 ఫిబ్రవరి
స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, కార్యక్రమ నిర్వాహకులు శ్రీధర్ శర్మ, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎక్సైజ్ ఎస్సై పి. మహేష్, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భారతదేశపు ఘనమైన శాస్త్రీయ వారసత్వాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలిపిన మహనీయుడు స్వర్గీయ డాక్టర్ సి.వి. రామన్ అని, ఫిబ్రవరి 28న ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రామన్ జీవిత విశేషాలను కొనియాడారు. 1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన రామన్ చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్రంపై మక్కువ పెంచుకున్నారని, ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటికీ, అన్వేషణే శ్వాసగా పరిశోధనల పట్ల తపన తో కలకత్తాలోని ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ లో రాత్రింబవళ్లు శ్రమించి అద్భుత ప్రయోగాలు చేశారని, సముద్రపు నీరు నీలిరంగులో ఎందుకు కనిపిస్తుందనే జిజ్ఞాసతో ప్రారంభమైన ఆయన అన్వేషణ ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు దారితీసిందని, కాంతి కిరణాలు పారదర్శకమైన ఘన, ద్రవ, వాయు మాధ్యమాల గుండా ప్రసరించినప్పుడు వాటి స్వభావంలో వచ్చే మార్పును ఆయన నిరూపించారని, ఈ ఆవిష్కరణ రసాయన శాస్త్రం, స్పెక్ట్రోస్కోపీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని, 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసిగా రామన్ రికార్డ్ సృష్టించాడని, దేశ అత్యున్నత పురస్కా రమైన భారతరత్నతో పాటు లెనిన్ శాంతి బహుమతినీ పొందారని, బెంగళూరులో ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ స్థాపించి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి కృషి చేశారని, విజ్ఞాన శాస్త్రం నిత్యజీవితంలో భాగమని, రామన్ వంటి మహనీయుల స్ఫూర్తితో నేటి విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు ప్రయత్నం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులుతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు వారి ఆధ్వర్యంలో ‘మత్తుపదార్థాలు – అవగాహన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పి. మహేష్ నేటి యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటికి దూరంగా ఉండాలని జీవిత విలువలు గురించి విద్యార్థినీ విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.