ఎస్.ఎస్.సి మార్చి–2026 పరీక్షల వయస్సు మరియు వయస్సు మినహాయింపు (Age Condonation) వివరాలు
తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించవలసిన ముఖ్య సమాచారం:
ఎస్.ఎస్.సి (10వ తరగతి) మార్చి–2026 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా 31/08/2011 లోపు జన్మించి ఉండాలి.
అంటే 31.08.2025 నాటికి విద్యార్థుల వయస్సు కనీసం 14 సంవత్సరాలు నిండాలి.
వయస్సు తక్కువగా ఉన్న విద్యార్థులు Age Condonation (వయస్సు మినహాయింపు) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ / లోకల్ బాడీ పాఠశాల విద్యార్థులకు:
18 నెలల వరకు తక్కువ వయస్సు — Gazetted హెచ్.యం గారికి అధికారం
2 సంవత్సరాల వరకు తక్కువ వయస్సు — DGE గారికి అధికారం
ప్రైవేటు / Aided పాఠశాల విద్యార్థులకు:
18 నెలల వరకు తక్కువ వయస్సు — DEO గారికి అధికారం
2 సంవత్సరాల వరకు తక్కువ వయస్సు — DGE గారికి అధికారం
వయస్సు మినహాయింపు కోసం అవసరమైన పత్రాలు:
₹300/- చలానా
మెడికల్ సర్టిఫికేట్
జననతేది ఆధార పత్రం (Date of Birth Proof)
ఈ పత్రాలను జతచేసి డి.ఈ.ఓ గారికి దరఖాస్తు చేయాలి.
ఫీజు తేదీ ప్రకటించగానే వెంటనే దరఖాస్తు చేయడం అత్యంత అవసరం.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సమాచారం ముందుగానే తెలుసుకొని చర్యలు తీసుకోవాలి.


