ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ నివాసులను పరామర్శించేందుకు ఖమ్మం నగరానికి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్రకు ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వచ్చిన ఈటెల రాజేంద్రకు స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భూక్యా శ్యాం సుందర్ నాయక్, శ్రీమతి విజయా రెడ్డి, నున్న రవికుమార్, జాటోతు మధు నాయక్, నాగేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు.
వెలుగుమట్ల భూదాన్ బాధితుల పరిస్థితిని పరిశీలించి వారికి అండగా నిలవాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.



