అమడగూరు,అక్టోబర్,09.(పున్నమి ప్రతినిధి):
అమడగూరు మండల పరిధిలోని మారుతిపురం గ్రామానికి చెందిన అజ్జే రజనీ బెంగళూరు విశ్వవిద్యాలయంలో 2024 ఎంఏలో తెలుగు పూర్తి చేసుకొని బంగారు పతకాన్ని సాధించింది.ఆమె తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, శ్రీనివాసులు అందించిన ప్రోత్సాహంతోనే బంగారు పతకాన్ని సాధించగలిగింది.ఈ సందర్భంగా అజ్జే రజనీ మాట్లాడుతూ…నేను నా చదువును శ్రీ సత్యసాయి జిల్లాలోని అమడగూరు,ఓడిచెరువు,కదిరిలో పదోతరగతి, ఇంటర్మీడియట్,డిగ్రీ చదువుకున్నానని ఆ తర్వాత మా గురువు షాన్వాజ్ సలహా మేరకు బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశానని అన్నారు. తెలుగులో స్వర్ణ పతకాన్ని సాధించడం ఆనందంగా ఉందని అన్నారు.ఇంతటి ఘన విజయానికి కారకులైన నా తల్లిదండ్రులు,గురువుల రుణం తీర్చుకోలేనిదని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు.మండల వాసి అయిన అజ్జే రజనీ బంగారు పతకాన్ని సాధించడం పట్ల పలువురు ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.


