జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా చిట్వేల్ మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో సోమవారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు కామాటం వెంకటేశ్వర్లు, సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగం అభివృద్ధికి చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. హిందూ–ముస్లింల ఐక్యతకు ఆయన చేసిన సేవలు దేశానికి ఆదర్శమని తెలిపారు. విద్యా సంస్కరణలకు పునాది వేసిన మౌలానా ఆజాద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులను సూచించారు.
తదనంతరం విద్యార్థులకు మిఠాయిలు, విద్యాసామగ్రి పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంఘ సభ్యులు షేక్ మస్తాన్ భాష, రియాజ్ భాషా, షబ్బీర్ భాష, గాడి ఇంతియాజ్ అహ్మద్, మహిళా సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


