ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.. ఖమ్మం జిల్లా నూకలంపాడు లో 20 ఏండ్లుగా విచిత్ర పరిస్థితి
షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్ పదవి,
ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో
ఉపసర్పంచ్గా ఎన్నికైన వ్యక్తికే సర్పంచ్ బాధ్యతలు
పున్నమి ఖమ్మం జిల్లా బ్యూరో
ఏన్కూరు: షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ… ఊర్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 20 ఏండ్లుగా ఉపసర్పంచ్గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత నాలుగు టర్మ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది


