Wednesday, 30 July 2025
  • Home  
  • ఉద్యోగ ఇంటర్‌వ్యూలో కష్టమైన ప్రశ్నలు , కొన్ని జవాబులు
- Featured - ఆంధ్రప్రదేశ్ - బిజినెస్

ఉద్యోగ ఇంటర్‌వ్యూలో కష్టమైన ప్రశ్నలు , కొన్ని జవాబులు

ఉద్యోగ ఇంటర్‌వ్యూలో కష్టమైన ప్రశ్నలు , కొన్ని జవాబులు ఈ వారం ఆర్టికల్‌, ఉద్యోగ వేట లో ఉన్న మహిళలు, పురుషుల కోసం. యువత, ఫ్రెషర్స్ ‌మరియు అనుభవం ఉన్న ఉద్యోగాభ్యర్ధుల కోసం. సో మిత్రులారా, మీరు ఉద్యోగం వేటలో, అప్లికేషన్‌ ‌పెట్టు కున్నారు. వారు ఇంటర్‌ ‌వ్యూకి పిలిచారు. మొదటి రౌండు ఫిల్టరింగు, ఫంక్షనల్‌ ‌రౌండు, హెచ్చార్‌ ‌రౌండు ఇంటర్‌ ‌వ్యూలు అయి పోయాయి. వారు అడిగే అడ్డమైన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. జనాభా ఎక్కువా, ఉద్యోగాలు తక్కువా ఉన్న మన భారత దేశంలో, అడిగేవాడికి (కంపెనీ వారికి) చెప్పేవాడు/చెప్పే ఆమె (అభ్యర్ధి(ని) లోకువ! ‘‘ఇంకో 5 ఏళ్ళ తరువాత నువ్వు ఫ్యూచర్‌లో ఎక్కడుంటావు, నీ ప్రణాళిక ప్రకారం ‘‘రేపేమి జరుగుతుందో ఎవరికి ఎరుక? కరోనా వచ్చి , మనని ఈ చొప్పదంటు ప్రశ్న అడిగిన హెచ్చార్‌ ‌మేనేజర్‌ ఉం‌టాడో, పోతాడో, నాలుగో రౌండులో మనకి కొత్త మొహం తగులుతుందో తెలియదు ! 5 ఏళ్ళ తరువాత మనం ఎక్కడుంటామట? ఇప్పుడు మీరివ్వబోయే ఉద్యోగం సరిగా చేయగలనా? లేదా? అది నిర్ధారించుకోండి? – అని చెప్పాలి అనిపిస్తుంది. అవసరం మనది కనుక నోటికి కుట్లేసుకుంటాము! ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు, మీ పంచ వర్ష ప్రణాళికలు ఏవైనా గానీ, బయట పెట్టే అవసరం లేదు! ‘‘ఈ కోవిడ్‌ ‌వచ్చాక రేపు ఏమి జరుగుతుందో తెలియదు. నేను అంత దూరం ఆలోచించ లేదు. ప్రస్తుతం ఈ ఉద్యోగానికి వచ్చాను. ఎంపిక అయితే బాగా చేయాలని ఉంది. ‘‘అంత వరకే చెప్పండి. ప్రస్తుతం ఈ ప్రపంచం ఉన్న పరిస్థితిలో ఈ సమాధానం ఓకే. మరొక పిచ్చి ప్రశ్న అడుగుతారు. మీ బలాలు ఏమిటి? ‘‘అని చెప్పవచ్చు. ‘‘మీ బలహీనతలు ఏమిటి?’’ అని కూడా అడుగుతారు !! ఏమి చెబుతాం? బలహీనత అని తెలిస్తే అది బలహీనత లాగ ఉండి పోదు కదా? దానిని ఇంప్రూవ్‌ ‌చేసుకునేందుకు ప్రయత్నిస్తాం. ‘‘నా బలహీనతలు ఏమిటో నాకంటే, నన్ను గమనించే ఇతరులకే బాగా తెలుస్తాయి. నాకు సహోద్యోగులు ఎవరైనా ఫీడ్‌ ‌బ్యాక్‌ ఇస్తే, తప్పని సరిగా దానిని స్వీకరించి సరి చేసుకుంటాను’’ అని చెప్ప వచ్చు. ‘‘అలాంటి సందర్భం ఇది వరలో ఎప్పుడైనా వచ్చిందా?’’ అని ప్రశ్నిస్తే, మీకు అటువంటిది జరిగిన సందర్భం షేర్‌ ‌చేసుకోచ్చు. ఉదాహరణకి ‘‘ నాకు బిగ్‌ ‌డాటా మీద అంత అనుభవం లేదు. మెరుగు పరుచుకొమ్మని చెప్పారు. అకాడమీలో చిన్న కోర్సులో చేరాను. ‘‘అనో లేదా పది మందిలో మాట్లాడేటప్పుడు నెర్వస్‌గా ఉన్నావు’’ అని చెప్పారు. ప్రాక్టీసు చేస్తున్నాను అనో, చెప్పవచ్చు. దాని వల్ల వచ్చే ఉద్యోగం రాకుండా పోదు. ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. ‘మీ బలహీనతలు ఏమిటి?’ అనేది. అవి లేని మనుషులు, ఉద్యోగులూ, ఉండరు. ‘నాకు బలహీనతలు లేవు’ అని చెప్పలేము! అలా అని ‘‘నన్ను ఇంటర్‌వ్యూ చేసే వారు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే నాకు భలే కోపం!’ అని నిజాలూ చెప్ప లేము ! కాస్త గడుసుగా దాట వేయాల్సిన ప్రశ్న. నీ కెంత జీతం కావాలి? – అస్సలు కమిట్‌ ‌కాకండి . ‘‘ఈ ఉద్యోగానికి, మీ కంపెనీ పేరుకీ, ఈ పొజిషన్‌కీ, నా నుంచి మీరు ఆశించే పనికీ, నా అనుభవానికీ- తగినంత జీతం ఇస్తారనే భావిస్తాను. ఒక వేళ మీరు నన్ను సెలెక్ట్ ‌చేసుకుంటే – ఎంత ఇస్తారో మీరే ఆఫర్‌ ఇవ్వండి ! ‘‘ అని అది వాళ్ళ మీదే తోయండి. వారు ఇచ్చేది చాలక పోతే మరి కాస్త ఇమ్మని అడగవచ్చు. కాని మీ అంతట మీరు ‘నాకు ఇంత కావాలి’అని కమిట్‌ ‌కాకండి. రెండు విధాలుగా నష్ట పోవచ్చు! ఒక వేళ మీరు అడిగినది, వారు ఇవ్వదలుచుకున్న దానికన్నా ఎక్కువ అయితే, వారు మీకు ఆఫర్‌ ఇవ్వక పోవచ్చు. ఒక వేళ వారు ఇవ్వదలుచుకున్నది, మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అయితే, మీకు ఉద్యోగం వస్తుంది కాని, మీరు నష్టపోవచ్చు! కాబట్టి మీరు కమిట్‌ ‌కాకండి! ఈ విధంగా, ఉద్యోగం కోసం జరిగే ఇంటర్‌ ‌వ్యూలలో అడిగే చిక్కు ప్రశ్నలని, చొప్పదంటు ప్రశ్నలని తెలివిగా ఎదుర్కోండి, అవసరం అయితే, దాటెయ్యండి. ఉద్యోగం వేటలో మీకు విజయం కలగాలని కోరుకుంటూ…

ఉద్యోగ ఇంటర్‌వ్యూలో కష్టమైన ప్రశ్నలు , కొన్ని జవాబులు
ఈ వారం ఆర్టికల్‌, ఉద్యోగ వేట లో ఉన్న మహిళలు, పురుషుల కోసం. యువత, ఫ్రెషర్స్ ‌మరియు అనుభవం ఉన్న ఉద్యోగాభ్యర్ధుల కోసం. సో మిత్రులారా, మీరు ఉద్యోగం వేటలో, అప్లికేషన్‌ ‌పెట్టు కున్నారు. వారు ఇంటర్‌ ‌వ్యూకి పిలిచారు. మొదటి రౌండు ఫిల్టరింగు, ఫంక్షనల్‌ ‌రౌండు, హెచ్చార్‌ ‌రౌండు ఇంటర్‌ ‌వ్యూలు అయి పోయాయి. వారు అడిగే అడ్డమైన ప్రశ్నలకు జవాబులు చెప్పారు.
జనాభా ఎక్కువా, ఉద్యోగాలు తక్కువా ఉన్న మన భారత దేశంలో, అడిగేవాడికి (కంపెనీ వారికి) చెప్పేవాడు/చెప్పే ఆమె (అభ్యర్ధి(ని) లోకువ!
‘‘ఇంకో 5 ఏళ్ళ తరువాత నువ్వు ఫ్యూచర్‌లో ఎక్కడుంటావు, నీ ప్రణాళిక ప్రకారం ‘‘రేపేమి జరుగుతుందో ఎవరికి ఎరుక? కరోనా వచ్చి , మనని ఈ చొప్పదంటు ప్రశ్న అడిగిన హెచ్చార్‌ ‌మేనేజర్‌
ఉం‌టాడో, పోతాడో, నాలుగో రౌండులో మనకి కొత్త మొహం తగులుతుందో తెలియదు ! 5 ఏళ్ళ తరువాత మనం ఎక్కడుంటామట? ఇప్పుడు మీరివ్వబోయే ఉద్యోగం సరిగా చేయగలనా? లేదా? అది నిర్ధారించుకోండి? – అని చెప్పాలి అనిపిస్తుంది. అవసరం మనది కనుక నోటికి కుట్లేసుకుంటాము!
ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు, మీ పంచ వర్ష ప్రణాళికలు ఏవైనా గానీ, బయట పెట్టే అవసరం లేదు! ‘‘ఈ కోవిడ్‌ ‌వచ్చాక రేపు ఏమి జరుగుతుందో తెలియదు. నేను అంత దూరం ఆలోచించ లేదు. ప్రస్తుతం ఈ ఉద్యోగానికి వచ్చాను. ఎంపిక అయితే బాగా చేయాలని ఉంది. ‘‘అంత వరకే చెప్పండి. ప్రస్తుతం ఈ ప్రపంచం ఉన్న పరిస్థితిలో ఈ సమాధానం ఓకే.
మరొక పిచ్చి ప్రశ్న అడుగుతారు. మీ బలాలు ఏమిటి? ‘‘అని చెప్పవచ్చు. ‘‘మీ బలహీనతలు ఏమిటి?’’ అని కూడా అడుగుతారు !! ఏమి చెబుతాం? బలహీనత అని తెలిస్తే అది బలహీనత లాగ ఉండి పోదు కదా? దానిని ఇంప్రూవ్‌ ‌చేసుకునేందుకు ప్రయత్నిస్తాం.
‘‘నా బలహీనతలు ఏమిటో నాకంటే, నన్ను గమనించే ఇతరులకే బాగా తెలుస్తాయి. నాకు సహోద్యోగులు ఎవరైనా ఫీడ్‌ ‌బ్యాక్‌ ఇస్తే, తప్పని సరిగా దానిని స్వీకరించి సరి చేసుకుంటాను’’ అని చెప్ప వచ్చు.
‘‘అలాంటి సందర్భం ఇది వరలో ఎప్పుడైనా వచ్చిందా?’’ అని ప్రశ్నిస్తే, మీకు అటువంటిది జరిగిన సందర్భం షేర్‌ ‌చేసుకోచ్చు.
ఉదాహరణకి ‘‘ నాకు బిగ్‌ ‌డాటా మీద అంత అనుభవం లేదు. మెరుగు పరుచుకొమ్మని చెప్పారు. అకాడమీలో చిన్న కోర్సులో చేరాను. ‘‘అనో లేదా పది మందిలో మాట్లాడేటప్పుడు నెర్వస్‌గా ఉన్నావు’’ అని చెప్పారు. ప్రాక్టీసు చేస్తున్నాను అనో, చెప్పవచ్చు. దాని వల్ల వచ్చే ఉద్యోగం రాకుండా పోదు.
ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. ‘మీ బలహీనతలు ఏమిటి?’ అనేది. అవి లేని మనుషులు, ఉద్యోగులూ, ఉండరు. ‘నాకు బలహీనతలు లేవు’ అని చెప్పలేము! అలా అని ‘‘నన్ను ఇంటర్‌వ్యూ చేసే వారు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే నాకు భలే కోపం!’ అని నిజాలూ చెప్ప లేము ! కాస్త గడుసుగా దాట వేయాల్సిన ప్రశ్న.
నీ కెంత జీతం కావాలి? – అస్సలు కమిట్‌ ‌కాకండి . ‘‘ఈ
ఉద్యోగానికి, మీ కంపెనీ పేరుకీ, ఈ పొజిషన్‌కీ, నా నుంచి మీరు ఆశించే పనికీ, నా అనుభవానికీ- తగినంత జీతం ఇస్తారనే భావిస్తాను. ఒక వేళ మీరు నన్ను సెలెక్ట్ ‌చేసుకుంటే – ఎంత ఇస్తారో మీరే ఆఫర్‌ ఇవ్వండి ! ‘‘ అని అది వాళ్ళ మీదే తోయండి. వారు ఇచ్చేది చాలక పోతే మరి కాస్త ఇమ్మని అడగవచ్చు. కాని మీ అంతట మీరు ‘నాకు ఇంత కావాలి’అని కమిట్‌ ‌కాకండి. రెండు విధాలుగా నష్ట పోవచ్చు!
ఒక వేళ మీరు అడిగినది, వారు ఇవ్వదలుచుకున్న దానికన్నా ఎక్కువ అయితే, వారు మీకు ఆఫర్‌ ఇవ్వక పోవచ్చు. ఒక వేళ వారు ఇవ్వదలుచుకున్నది, మీరు అడిగిన దానికన్నా ఎక్కువ అయితే, మీకు ఉద్యోగం వస్తుంది కాని, మీరు నష్టపోవచ్చు! కాబట్టి మీరు కమిట్‌ ‌కాకండి! ఈ విధంగా, ఉద్యోగం కోసం జరిగే ఇంటర్‌ ‌వ్యూలలో అడిగే చిక్కు ప్రశ్నలని, చొప్పదంటు ప్రశ్నలని తెలివిగా ఎదుర్కోండి, అవసరం అయితే, దాటెయ్యండి. ఉద్యోగం వేటలో మీకు విజయం కలగాలని కోరుకుంటూ…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.