నెల్లూరు — పున్నమి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్లోని పీపుల్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో గోల్డ్ లోన్స్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిసెంబర్ 23, 24 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. సేల్స్ మేనేజర్లు, సేల్స్ ఆఫీసర్లు, అప్రైజర్లు, ఆడిటర్లు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని కోరారు.


