కర్నూలు (పున్నమి ప్రతినిధి) జర్నలిస్టుల సామాజిక సేవ అభినందనీయం
నిరుపేదలకు కంటి అద్దాల పంపిణీ
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు కె. గంగాధర్ రెడ్డి
ప్రభుత్వ నిబంధనలు, సౌకర్యాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఒక వరం లాంటివని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు కె. గంగాధర్ రెడ్డి మరియు ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్ జానకిరామయ్య పేర్కొన్నారు. ఆదివారం కల్లూరులోని ఆదిత్య పాఠశాల ఆవరణలో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం గౌరవాధ్యక్షులు పి. యూసుఫ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లబ్ధిదారులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నిరంతరం ప్రజల సేవలో.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో వార్తలు సేకరించడమే మాత్రమే జర్నలిస్టుల పని అని అనుకోకుండా ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ జర్నలిస్టులే స్వయంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమైన విషయమని, వారి చొరవ ఆదర్శవంతమైనది అని కొనియాడారు. ఇప్పటికే పలుమార్లు వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు చికిత్స అందించడం ఒక గొప్ప సేవ అని తెలిపారు. భవిష్యత్తులో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేస్తామని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.
కంటి అద్దాల పంపిణీ గతంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వారికి నేడు ఉచితంగా అద్దాలను పంపిణీ చేశారు. ఏ.పీ.జే.ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ, కల్లూరు ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.వి. ఖాజా ఈ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టులు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ జిల్లా కార్యదర్శి వై. రాజశేఖర్, జిల్లా నాయకులు దండు విద్యాసాగర్, వి. విజయ్ కుమార్, కె. వెంకటేశ్వర రెడ్డి, మల్లికార్జున, నగర అధ్యక్షులు పి. నాగేంద్రుడు, నగర నాయకులు ఎస్.కె. మధు మరియు పెద్ద సంఖ్యలో యువకులు వృద్ధులు మహిళలు పాల్గొన్నారు.



