సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అమలవుతున్న ఆర్టిఈ చట్టం 12(1)(C) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి అర్హుల జాబితాను రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన మొత్తం 808 మంది విద్యార్ధులు ఉచిత ప్రవేశాలకు అర్హత పొందినవారిగా ఎంపిక చేయబడ్డారు. వీరికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% రిజర్వేషన్ కోటా కింద ఉచిత ప్రవేశాలు కేటాయించబడినవి.
మునుపుగా అడ్మిషన్ ప్రక్రియను 07 ఏప్రిల్ 2026 లోపు పూర్తిచేయవలసిందిగా సూచించగా, పలు తల్లిదండ్రుల అభ్యర్ధనలు దృష్ట్యా, విద్యార్ధుల ప్రయోజనార్ధం అడ్మిషన్ గడువును 10 ఏప్రిల్ 2026 వరకు పొడిగించడం జరిగినది.
అందువల్ల అర్హత పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల అర్హత ధృవపత్రాలు (ఇన్కమ్, కాస్ట్, ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు మొదలైనవి) మరియు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు, తమకు కేటాయించిన సంబంధిత పాఠశాలలో 10 ఏప్రిల్ 2026 లోపు సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయవలెను.
ముఖ్యంగా, ఉచిత ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులకు కేటాయించిన పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్మిషన్ నిరాకరించరాదు.
గడువు లోపు ప్రక్రియ పూర్తిచేయని పక్షంలో, అలాటెడ్ సీటు రద్దు చేయబడుతూ తదుపరి అర్హులకు అవకాశం కల్పించబడుతుంది..
అభ్యర్ధులు తమ ఎంపిక స్థితి మరియు కేటాయించిన పాఠశాల వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును. ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత పాఠశాల నిర్వాహకులు, మండల విద్యాశాఖ కార్యాలయం (MEO Office) లేదా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయాన్ని సంప్రదించవచ్చును.
మండల విద్యాశాఖాధికారులు (MEOలు) ఈ గడువు పొడిగింపు విషయాన్ని తమ పరిధిలోని తల్లిదండ్రులకు విస్తృతంగా తెలియజేయడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి నిరాకరణలు చేయకుండా అడ్మిషన్లు చేపట్టేలా పర్యవేక్షించి, జరిగిన అడ్మిషన్ వివరాలను ధృవీకరించి పూర్తి నివేదికను లిఖితపూర్వకంగా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించవలసిందిగా ఆదేశించబడింది.
ఈ సందర్భంగా ఏపీసీ డి. వెంకటసుబ్బయ్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించే ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని, గడువు లోపు ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని, వారి పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా మారుతుందని పేర్కొన్నారు.

ఉచిత ప్రవేశాలకు గడువు పొడిగింపు – ఏప్రిల్ 10 వరకు అవకాశం
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అమలవుతున్న ఆర్టిఈ చట్టం 12(1)(C) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి అర్హుల జాబితాను రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ విడుదల చేసిన విషయం విదితమే. ఈ జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన మొత్తం 808 మంది విద్యార్ధులు ఉచిత ప్రవేశాలకు అర్హత పొందినవారిగా ఎంపిక చేయబడ్డారు. వీరికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% రిజర్వేషన్ కోటా కింద ఉచిత ప్రవేశాలు కేటాయించబడినవి. మునుపుగా అడ్మిషన్ ప్రక్రియను 07 ఏప్రిల్ 2026 లోపు పూర్తిచేయవలసిందిగా సూచించగా, పలు తల్లిదండ్రుల అభ్యర్ధనలు దృష్ట్యా, విద్యార్ధుల ప్రయోజనార్ధం అడ్మిషన్ గడువును 10 ఏప్రిల్ 2026 వరకు పొడిగించడం జరిగినది. అందువల్ల అర్హత పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల అర్హత ధృవపత్రాలు (ఇన్కమ్, కాస్ట్, ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు మొదలైనవి) మరియు ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు, తమకు కేటాయించిన సంబంధిత పాఠశాలలో 10 ఏప్రిల్ 2026 లోపు సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తిచేయవలెను. ముఖ్యంగా, ఉచిత ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థులకు కేటాయించిన పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్మిషన్ నిరాకరించరాదు. గడువు లోపు ప్రక్రియ పూర్తిచేయని పక్షంలో, అలాటెడ్ సీటు రద్దు చేయబడుతూ తదుపరి అర్హులకు అవకాశం కల్పించబడుతుంది.. అభ్యర్ధులు తమ ఎంపిక స్థితి మరియు కేటాయించిన పాఠశాల వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చును. ఎటువంటి సందేహాలు ఉన్నా సంబంధిత పాఠశాల నిర్వాహకులు, మండల విద్యాశాఖ కార్యాలయం (MEO Office) లేదా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయాన్ని సంప్రదించవచ్చును. మండల విద్యాశాఖాధికారులు (MEOలు) ఈ గడువు పొడిగింపు విషయాన్ని తమ పరిధిలోని తల్లిదండ్రులకు విస్తృతంగా తెలియజేయడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి నిరాకరణలు చేయకుండా అడ్మిషన్లు చేపట్టేలా పర్యవేక్షించి, జరిగిన అడ్మిషన్ వివరాలను ధృవీకరించి పూర్తి నివేదికను లిఖితపూర్వకంగా జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించవలసిందిగా ఆదేశించబడింది. ఈ సందర్భంగా ఏపీసీ డి. వెంకటసుబ్బయ్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించే ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని, గడువు లోపు ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని, వారి పిల్లల భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా మారుతుందని పేర్కొన్నారు.

