ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి)
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని వి.యం. బంజర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ రాజా సాయి మందిరం మరియు ఖమ్మం మమత జనరల్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో, శ్రీమతి జెన్నారెడ్డి విజయ రెడ్డి జ్ఞాపకార్థం ఈ శిబిరాన్ని ఈ నెల 14వ తేదీ (శనివారం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని ఆమె భర్త, విశ్రాంత సర్కిల్ ఇన్స్పెక్టర్ జెన్నారెడ్డి నర్సింహా రెడ్డి మరియు శ్రీ రాజా సాయి మందిరం చైర్మన్ శ్రీమతి నీలపు ఉమా సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ శిబిరాన్ని వినియోగించుకుని ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



