ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి
వెంకటాచలం,ఫిబ్రవరి 15 (పున్నమి విలేఖరి):
ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వెంకటాచలం మండలంలోని చెముడుగుంట చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బుజబుజ నెల్లూరుకు చెందిన షేక్ మస్తాన్ కుమారుడు షేక్ సలీమ్ (13), పార్లపల్లి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు వెంకట సాయి (14), మోపూరు రాజా కుమారుడు రాజేష్ (13) ఆదివారం సెలవు కావడంతో చెముడుగుంట హైవే ని ఆనుకొని ఉన్న చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. సరదాగా ఈతకోసం దిగిన చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడంతో మృతి చెందారు. పొద్దుబోయినా ఇంటికి పిల్లలు రాకపోయేసరికి తల్లిదండ్రులు, సమీప బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలు గాలించారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో చెముడుగుంట పంచాయతీ నక్క కాలనీ చెరువు గట్టుపైన ఉన్న చిన్నారుల సైకిళ్ళు, బట్టలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ, వెంకటాచలం ఎస్ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి కావడంతో ఎంత సేపు గాలించినా ఆచూకీ కానరాలేదు. సోమవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ తమ కళ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలను ఒక్కసారిగా మృతదేహాలుగా చూసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి వెంకటాచలం,ఫిబ్రవరి 15 (పున్నమి విలేఖరి): ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వెంకటాచలం మండలంలోని చెముడుగుంట చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బుజబుజ నెల్లూరుకు చెందిన షేక్ మస్తాన్ కుమారుడు షేక్ సలీమ్ (13), పార్లపల్లి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు వెంకట సాయి (14), మోపూరు రాజా కుమారుడు రాజేష్ (13) ఆదివారం సెలవు కావడంతో చెముడుగుంట హైవే ని ఆనుకొని ఉన్న చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. సరదాగా ఈతకోసం దిగిన చిన్నారులు ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడంతో మృతి చెందారు. పొద్దుబోయినా ఇంటికి పిల్లలు రాకపోయేసరికి తల్లిదండ్రులు, సమీప బంధువులు చుట్టుపక్కల ప్రాంతాలు గాలించారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో చెముడుగుంట పంచాయతీ నక్క కాలనీ చెరువు గట్టుపైన ఉన్న చిన్నారుల సైకిళ్ళు, బట్టలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ సీఐ రామకృష్ణ, వెంకటాచలం ఎస్ఐ కరీముల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి కావడంతో ఎంత సేపు గాలించినా ఆచూకీ కానరాలేదు. సోమవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ తమ కళ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలను ఒక్కసారిగా మృతదేహాలుగా చూసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

