ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం జిల్లా లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒకరు మల్లు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం అభివృద్ధి చెందినది. హైదరాబాద్ మహానగరం అంత అభివృద్ధి చేసాం అని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రులు ఒక్క సారి వర్షాకాలం లో ఖమ్మం నగరం లో మీరు చేసిన అభివృద్ధి ఏంటో అని ఒక సారి బూతద్ధం పెట్టి వెతకండి. కనిపిస్తుందేమో చూద్దాం. డ్రైనేజీ లు పొంగి పొర్లుతున్నాయి. వాటి వల్ల మోకాళ్ళు లోతు నీళ్లు తో ప్రజలు నానా యాతన పడుతుంటే మంత్రులేమో దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహారిస్తునట్లు ఉన్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారూ.


