ఇది.. ఓ కరోనా మిగిల్చిన విషాద కథ..అన్నీ ఉన్నా అనాథను చేసిన విషాద ఘటన.. ప్రపంచాన్ని వణికిస్తున్న కా రోనా మహమ్మారి తెలుగురాష్ట్రాల్లో మిగిల్చిన కన్నీటి వ్యధ.
ఆయనో… పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్.. ఆస్తిపరుడు.. ఆర్ధిక స్థితిమంతుడు… పెద్ద ఎత్తున బంధుత్వాలు ఉన్నాయి..అతని చేత్తో వైద్యం చేస్తే.. ఎలాంటి రోగమైనా.. కీళ్లనొప్పులు..కాళ్ళనొప్పులు.. ఇట్టే మాయమౌతాయి… ఆయన హస్తవాసికున్న ప్రత్యేకతది… అందుకే 50 నుంచి 60 ఏళ్ల వయస్కులకు ఆయన
వైద్యమంటే అంత నమ్మకం.. అందుకే ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే కనీసం వారం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.. అలాంటి వైద్యుడు …ముఖ్యంగా ఓ వర్గానికి చెందినవారి కి ఆయన వైద్యం పట్ల అపారమైన నమ్మకం… వైద్యం కోసం వెళ్లినవారిని నఖశిఖలా తడుముతూ.. నొప్పులు తగ్గిస్తారు..బహుశా ఏ డాక్టర్ అతనిలా రోగిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా వైద్యం చేయరేమో.. చివరికి రోగిపట్ల ఆ ఆప్యాయత ఆయన ప్రాణాలు తీసింది.. కరోనా రూపంలో కాటేసింది..వారం క్రితం వరకు వైద్యం చేసిన ఆ
చేతులను..ఆ డాక్టర్ ను తాకేందుకు.చివరికి చూసేందుకు అందరూ భయపడ్డారు..ఆఖరి దశలో అనాథలా కాలగర్భంలో కలిసిపోయారు..ఇదే మొన్న కరోనా తో కన్నుమూసిన డాక్టర్ పీ. లక్ష్మీనారాయణ రెడ్డి..కథ.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మొహం మరి ఎంత కఠినంగా కఠోరంగా భయంకరంగా ఉంటుందో దానికి చేతుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారి దుస్థితిని చూస్తే ఎవరికైనా గగుర్పాటు కలగకమానదు కరోనా మహమ్మారి కాటేస్తే వారి జీవితం ఎంతటి దుర్భరంగా ఉంటుందో ఇప్పటివరకు మనం విన్నాం ప్రపంచవ్యాప్తంగా కన్నం నెల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం ఈ కరో నా మహమ్మారి బారినపడ్డ డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి జీవిత చరమాంకం పెద్ద తార్కాణం.. ఆయన మరణాంతర పరిస్థితి చూస్తే ఎవ్వరైనా గగుర్పాటుకు గురికాకతప్పుదు. ఈ వ్యాధి సోకితే ఎంతటి దుర్భర స్థితి ఉంటుందో మనిషిలో గుబులు పుట్టిస్తోంది.ఒక డాక్టర్ గా తన చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడి డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి చివరకు దిక్కులేని దహన సంస్కారాలకు గురయ్యారు.
నెల్లూరు నగరంలో ఆర్థో వైద్య చికిత్సల్లో చేయి తిరిగిన డాక్టర్ లలో ఆయనొకరు. అంతకుమించి మంచి హస్త వ్యాధి కలిగిన వైద్యుడిగా పేరుంది.. డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డికి. ఎంతోమంది వైకల్యం కలిగిన వారికి దారి చూపారు. ప్రమాదాల్లోనో… పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన అనేకమందికి జీవితం మీద నమ్మకాన్ని ,భరోసాను కలిగించారు ఆయన.. అంతటి వైదుడిని కరోనా క్షబ్సలించినానంతరం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. ఎంతోమందిని వైద్యం కోసం స్ఫురించిన ఆయన్ను తాకేందుకు ఏ చేతులూ ముందుకు రాలేదు.. నిరంతరం వైద్యసేవల్లో మునిగి ఉండే ఆయనకు వారం క్రితం . అస్వస్థతగా ఉందని నెల్లూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్తితి విషమంగా ఉండటంతో అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా అని తేలవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు.పరిస్థితి విషమించడంతో లక్ష్మీనారాయణ రెడ్డిని మెరుగైన వైద్య చికిత్సలు కోసం పక్కరాష్ట్రం చెన్నై లోని అపోలో హాస్పిటల్స్ కి తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు.
అరుదైన డాక్టర్ని పొట్టన పెట్టుకున్న కరోనా ఆయన కుటుంభం,తన వైద్యశాల పైనా పంజావిసిరింది.దురదృష్టవశాత్తూ ఆయన చనిపోవడానికి ముందే కరోనా వల్ల ఆయన కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించారు. అక్కడ వారికి పాజిటివ్ అని తేలడంతో వారు నెల్లూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత డాక్టరు చనిపోగా కేంద్ర నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగించకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు.బట్ కరోనా మరణం కావడం – ప్రత్యేక అనుమతులు అవసరం కావడం వల్ల బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. సొంత కుటుంబం ఐసోలేషన్ వార్డులో ఉంది. అనాథగా అయినా అంత్యక్రియలు జరిగాయా అంటే అదీ లేదు. ఆస్పత్రి సిబ్బంది ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కానీ అక్కడ శవ దహనానికి నిరాకరించారు. మరో చోట కూడా అలాగే జరిగింది. కారణమేంటో తెలుసా… ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో మరణాలకే చేయాలని వారికి నిబంధనలు ఉన్నాయట. ఏం చేయాలో తోచని సిబ్బంది… అంబత్తూరు శ్మశాన వాటిక వద్దకు ఆ డాక్టరు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం తీసుకెళ్లారు. ఇది తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడి ధర్నాకు దిగారు.కరోనాతో మృతి చెందిన వారికి ఇక్కడ దహనం చేయడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు. ఆస్పత్రి సిబ్బందిని దూషించారు.దాంతో చేసేది లేక మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు…డాక్టర్ డెడ్ బాడీ ని మళ్ళీమార్చురీకి తరలించారు.తెల్లవారు ఝామున ఎవ్వరూ లేనిసమయంలో అంబత్తూర్ ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు తరలించి డాక్టర్ అంత్యక్రియలు పూర్తిచేశారు.. ఆస్తులు.. ఆర్థిక పరిస్థితులు.. బందుగణం.. ఉన్న ఒక పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్ కరోనా భారిన పడితే ఎలాంటి ఎదురైందో చూడండి.. చివరకు అంత్యక్రియలు కు నోచుకోని దుస్థితి.. ఎదురైందంటే.. ఈ మహమ్మారిపట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రతీ ఒక్కరూ ఆలోసించండి… బీ కేర్ ఫర్ కరోనా.