పున్నమి
వార్త మిర్రర్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు అధైర్యపడొద్దని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ తుక్కుగూడ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేఎల్ఆర్ స్పందించారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇంటి నిర్మాణం చేయకున్నా… ఫోన్ నంబర్ తప్పుగా ఇచ్చినా.. ఆధార్ కార్డ్ అప్ డేట్ లేకున్నా… ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే డబ్బులు జమ కావటం లేదని తెలిపారు. సంబంధిత హౌసింగ్ అధికారులతో ఆయన మాట్లాడారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను గుర్తించి పేదలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ కాంగ్రెస్ హయాంలోనే పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు లక్ష్మారెడ్డి.జూబ్లీహిల్స్ హస్తనిదే
రేపు జరిగే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కిచ్చెన్న ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో దాదాపు 70శాతానికి పైగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయన్నారు.

