ముస్తాబాద్ /మార్చి /పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ని రాంరెడ్డిపల్లె గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద సంపంగి మమత–శ్రీనివాస్ దంపతులు నిర్మించుకున్న కొత్త ఇంటికి ఈరోజు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి హాజరై గృహప్రవేశంలో పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సొంత ఇల్లు కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


