*ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య*
*ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది*
పున్నమి న్యూస్ ప్రతినిధి:
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
22 జనవరి 2026
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రం, వెంకటరమణ కాలనీకి చెందిన మాదరి శివకుమార్ (35) అనే యువకుడు ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా అతను గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవ పడేవాడు. అయితే ఈ నెల 21 రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇబ్రహీంపట్నం నుంచి రాయపోల్ వెళ్లే దారిలో నల్ల కంచ అటవీప్రాంతంలో ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడాడు. దీంతో సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


