Monday, 23 February 2026
  • Home  
  • ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.*
- తిరుపతి

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.*

పరీక్షా కేంద్ర వద్ద డ్రోన్ తో సైతం నిఘా పెట్టిన జిల్లా పోలీసులు.* పున్నమి ప్రతినిధి, చిత్తూరు జిల్లా సోమవారం నుండి మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షల నేపద్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రాన్ని అత్యంత సున్నితంగా పరిగణనలోకి తీసుకొని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా, పూర్తిస్థాయిలో పరీక్షలపై దృష్టి సారించేలా సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించి నిఘా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రాల పరిసరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అనవసర గుంపులు చేరకుండా సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు, విద్యార్థులు తప్ప ఇతరులకు అనుమతి లేకుండా నియంత్రణలు విధించారు.ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ ద్వారా పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, కాపీయింగ్, అనుమానాస్పద కదలికలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు ఏవైనా జరిగితే తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పరీక్షలు నిర్వహించే అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పరీక్షల ముగింపు వరకు ఇదే స్థాయిలో బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు.

పరీక్షా కేంద్ర వద్ద డ్రోన్ తో సైతం నిఘా పెట్టిన జిల్లా పోలీసులు.*

పున్నమి ప్రతినిధి, చిత్తూరు జిల్లా

సోమవారం నుండి మొదలైన ఇంటర్మీడియట్ పరీక్షల నేపద్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రాన్ని అత్యంత సున్నితంగా పరిగణనలోకి తీసుకొని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా, పూర్తిస్థాయిలో పరీక్షలపై దృష్టి సారించేలా సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించి నిఘా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రాల పరిసరాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకునేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద అనవసర గుంపులు చేరకుండా సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు, విద్యార్థులు తప్ప ఇతరులకు అనుమతి లేకుండా నియంత్రణలు విధించారు.ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ నిఘాను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్ ద్వారా పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, కాపీయింగ్, అనుమానాస్పద కదలికలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు ఏవైనా జరిగితే తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పరీక్షలు నిర్వహించే అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పరీక్షల ముగింపు వరకు ఇదే స్థాయిలో బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.