Saturday, 21 February 2026
  • Home  
  • ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ అవార్డు అందుకున్న సడిమెల శోభారానికి దళిత బహుజన నాయకులు ఘన సన్మానం
- రాజన్న సిరిసిల్ల

ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ అవార్డు అందుకున్న సడిమెల శోభారానికి దళిత బహుజన నాయకులు ఘన సన్మానం

ముస్తాబాద్/ ఫిబ్రవరి /పున్నమి ప్రతినిధి కలాంగులకు మరియు పెన్షన్ దారులకు నిరంతరం సేవలందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న వికలాంగుల జిల్లా కన్వీనర్ సడిమెల శోభారాణి గారు ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ పేరుతో అందించే ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ అవార్డు అందుకోవడం పట్ల ఈరోజు మండల దళిత బహుజన నాయకులు కలిసి ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల పరిరక్షణ, పెన్షన్ దారుల సమస్యల పరిష్కారం కోసం శోభారాణి గారు చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. సడిమెల శోభారాణి గారు మాట్లాడుతూ, తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా వికలాంగులు మరియు పేద ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల దళిత బహుజన నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ముస్తాబాద్/ ఫిబ్రవరి /పున్నమి ప్రతినిధి

కలాంగులకు మరియు పెన్షన్ దారులకు నిరంతరం సేవలందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న వికలాంగుల జిల్లా కన్వీనర్ సడిమెల శోభారాణి గారు ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ పేరుతో అందించే ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ అవార్డు అందుకోవడం పట్ల ఈరోజు మండల దళిత బహుజన నాయకులు కలిసి ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల పరిరక్షణ, పెన్షన్ దారుల సమస్యల పరిష్కారం కోసం శోభారాణి గారు చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు.
సడిమెల శోభారాణి గారు మాట్లాడుతూ, తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా వికలాంగులు మరియు పేద ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల దళిత బహుజన నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.