Thursday, 19 March 2026
  • Home  
  • ఆశీస్సులతో ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న తనయుడు – సహాయం చేసిన జనసేన కుటుంబానికి చిన్నా కృతజ్ఞతలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆశీస్సులతో ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న తనయుడు – సహాయం చేసిన జనసేన కుటుంబానికి చిన్నా కృతజ్ఞతలు

నెల్లూరు జిల్లా: తనయుడు ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరుకున్న సందర్భంగా జనసేన నాయకుడు చిన్నా భావోద్వేగానికి గురయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తన కుమారుడు, వైద్యుల చికిత్సతో కోలుకుని మార్చి 13వ తేదీన డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తనకు ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచిన జనసేన కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా జనసేన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు, వీర మహిళలు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ శ్రేణులు అందించిన సహాయం, సహకారం జీవితాంతం మరువలేనిదని పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రికి స్వయంగా వచ్చి పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకత్వానికి, తెలుగు రాష్ట్రాల జనసైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట సమయంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని చిన్నా భావోద్వేగంగా వెల్లడించారు.

నెల్లూరు జిల్లా:
తనయుడు ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరుకున్న సందర్భంగా జనసేన నాయకుడు చిన్నా భావోద్వేగానికి గురయ్యారు.
ఫిబ్రవరి 25వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తన కుమారుడు, వైద్యుల చికిత్సతో కోలుకుని మార్చి 13వ తేదీన డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తనకు ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచిన జనసేన కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యేకంగా జనసేన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు, వీర మహిళలు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ శ్రేణులు అందించిన సహాయం, సహకారం జీవితాంతం మరువలేనిదని పేర్కొన్నారు.
అలాగే ఆసుపత్రికి స్వయంగా వచ్చి పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకత్వానికి, తెలుగు రాష్ట్రాల జనసైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట సమయంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ జీవితాంతం రుణపడి ఉంటానని చిన్నా భావోద్వేగంగా వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.