Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

ఆబాది భూముల రీ సర్వే రికార్డుల ప్రక్రియను పరిశీలించిన మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి

Punnami Newsroom Published:
ఆబాది భూముల రీ సర్వే రికార్డుల ప్రక్రియను పరిశీలించిన మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి

ఆబాది భూముల రీ సర్వే రికార్డుల ప్రక్రియను పరిశీలించిన మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి

మరిపెడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆబాది భూముల రీ సర్వే కార్యక్రమంలో భాగంగా మరిపెడ మండలంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా మరిపెడ మండల తహసీల్దార్ కృష్ణవేణి రీ సర్వేకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, సర్వే ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రీ సర్వే పనులు పారదర్శకంగా, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు.

అనంతరం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఆబాది భూముల రీ సర్వే పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపాలన అధికారి రమేష్, తెలంగాణ ప్రభుత్వ లైసెన్స్ పొందిన సర్వేయర్లు భూక్య రాము నాయక్, శివకుమార్, గ్రామ సిబ్బంది నాన్నయ్య, వెంకటాద్రి, గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆబాది భూముల రీ సర్వే రికార్డుల ప్రక్రియను పరిశీలించిన మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *