Tuesday, 17 March 2026
  • Home  
  • ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కావలిలో కార్డన్, సెర్చ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కావలిలో కార్డన్, సెర్చ్

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పోలీసులు నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కావలి 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఇంటింటి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై దృష్టి సారిస్తూ పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 27 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, కొత్తగా ప్రాంతానికి వచ్చిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని పోలీసులు తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలను సేకరిస్తూ, అనుమానాస్పద వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, తమ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పోలీసులు నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా కావలి 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు.
పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టి ఇంటింటి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై దృష్టి సారిస్తూ పత్రాలు లేని వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 27 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా, కొత్తగా ప్రాంతానికి వచ్చిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని పోలీసులు తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారి వివరాలను సేకరిస్తూ, అనుమానాస్పద వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని, తమ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.