— పున్నమి ప్రతినిధి
ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరిట సైబర్ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుణేలో జరిగిన ఘటనలో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడిని నమ్మించి రూ.1.32 కోట్లు కాజేశారు. విదేశీ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ ప్రతినిధులు, ఫ్యాషన్ డిజైనర్లుగా నటిస్తూ ఖరడీ ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


