నంద్యాల గాంధీ చౌక్ సమీపంలో ఉన్న నెరవాటి పాలి క్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ,ఆదివారం నెరవాటి పాలి క్లినిక్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,పాలి క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ వినోద్, డాక్టర్ సుమన్,రమేష్, హరినాథ్ , నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్ శిబిరం వివరాలు శుక్రవారం ప్రకటించారు. ఈ వైద్య శిబిరంలో స్త్రీ వ్యాధులు మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఫాతిమా, ఎముకలు, కీళ్ల నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్,చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పబ్బతి దివ్య తేజ, దంత వైద్యులు డాక్టర్ పద్మ ప్రియాంక, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నటరాజ్ వైద్య సేవలు అందిస్తారు. ఎముకల సాంద్రత, పటుత్వాన్ని సూచించే బి.ఎం.డి. పరీక్ష అవసరమైన వారికి ఉచితంగా నిర్వహిస్తారు.
అవసరమైన ఇతర పరీక్షలు కూడా నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నంద్యాల పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలను కోరారు.ఉచిత మెగా వైద్య శిబిరం కరపత్రాలు విడుదల చేస్తున్న డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ వినోద్, డాక్టర్ సుమన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్.

ఆదివారం నెరవాటి పాలి క్లినిక్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నెరవాటి పాలి క్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణ.
నంద్యాల గాంధీ చౌక్ సమీపంలో ఉన్న నెరవాటి పాలి క్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ,ఆదివారం నెరవాటి పాలి క్లినిక్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,పాలి క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ వినోద్, డాక్టర్ సుమన్,రమేష్, హరినాథ్ , నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్ శిబిరం వివరాలు శుక్రవారం ప్రకటించారు. ఈ వైద్య శిబిరంలో స్త్రీ వ్యాధులు మరియు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ ఫాతిమా, ఎముకలు, కీళ్ల నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్,చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పబ్బతి దివ్య తేజ, దంత వైద్యులు డాక్టర్ పద్మ ప్రియాంక, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నటరాజ్ వైద్య సేవలు అందిస్తారు. ఎముకల సాంద్రత, పటుత్వాన్ని సూచించే బి.ఎం.డి. పరీక్ష అవసరమైన వారికి ఉచితంగా నిర్వహిస్తారు. అవసరమైన ఇతర పరీక్షలు కూడా నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నంద్యాల పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలను కోరారు.ఉచిత మెగా వైద్య శిబిరం కరపత్రాలు విడుదల చేస్తున్న డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ వినోద్, డాక్టర్ సుమన్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్.

