ఏర్పేడు, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటూ వెళ్లిన ఆ చిన్నారిని మృత్యువు జేసీబీ గుంత రూపంలో కబళించింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నెల్లూరు జిల్లా సౌత్ అమలూరుకు చెందిన శంకరయ్య, విజయ దంపతులు రెండేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం చిందేపల్లికి వలస వచ్చారు. శంకరయ్య స్థానిక వెంచర్లో వాచ్మెన్గా పనిచేస్తూ, చిందేపల్లి ఎస్టీ కాలనీలో నివాసముంటున్నారు. వీరి కుమార్తె ఎండ్ల సుస్మిత (6) స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు ఒక అంత్యక్రియల నిమిత్తం వేరే ఊరికి వెళ్లగా, పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సుస్మిత మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి చెరువు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో చెరువులో అన్వేషణ చేస్తూ ప్రమాదవశాత్తూ కాలుజారి లోతుగా ఉన్న జేసీబీ గుంతలో పడిపోయింది. తోటి పిల్లలు కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి సుస్మితను బయటకు తీశారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెంది ఉండటంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కళ్లముందే ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

ఆడుకుంటూ అనంతలోకాలకు.. జేసీబీ గుంతలో పడి చిన్నారి మృతి