రైల్వే కోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కేంద్రంలో ఆటో కార్మికుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ పాల్గొని ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రస్తుతం ప్రీబస్సు వల్ల ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిన్నదని, అనేక కుటుంబాలు ఆకలితో రోడ్లపై పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో కార్మికులను నిర్లక్ష్యం చేయకుండా, వారికి తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. అలాగే ఆటో కార్మికుల కోసం PF, ESI సౌకర్యాలతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఆయన మరింతగా మాట్లాడుతూ, ఆటో కార్మికుల కనీస సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో తీవ్ర కార్యాచరణ చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ నెల 16న అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని ఆటో కార్మికులను పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఆటో సంఘం నాయకులు దేశయ్య, గంగయ్య, వెంకటసుబ్బయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.


