*ఆంధ్రా మెడికల్ కాలేజీలో లో ” ఆహ్వాన్ 2025″ ఫ్రెషర్స్ డే వేడుకలకు హాజరైన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, గౌరవ కలెక్టర్ శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు*
* *కూటమి ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
“`కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీలో కాబ్ ఆడిటోరియం లో “ఆహ్వాన్ 2025” ఫ్రెషర్స్ డే వేడుకలకు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ హరేందర్ ప్రసాద్ గారు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే ద్వారా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. కొత్త విద్యార్థులలో క్రమశిక్షణ , విలువలు, సృజనాత్మక, ఆవిష్కరణ లతో ముందుకు సాగాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు , రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు , సత్య కుమార్ గారు , ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ఆరోగ్య ప్రమాణాలు పెంచడానికి ఎంతో కృషి చేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ శ్రీమతి సంధ్యాదేవి గారు, సూపర్డెంట్ శ్రీమతి వాణి గారు, వైద్య విభాగం పెద్దలు శ్రీ మన్మధరావు గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, శ్రీమతి శ్యామలగారు, శ్రీమతి వాసవి లత గారు, శ్రీ శ్రీహరి గారు, కూటమి నేతలు శ్రీ జగదీష్ గారు, శ్రీ సతీష్ పొన్నం గారు, శ్రీ జగన్ గారు, శ్రీ రాజశేఖర్ గారు, స్థానిక జనసేన వార్డు అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ గారు పాల్గొన్నారు…“`


