ఏపీలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా : చంద్రబాబు
మంగళగిరి అక్టోబర్పు పున్నమి ప్రతినిధి:
సీసీ కెమెరాలు.. పోలీసు యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి 55 కి.మీలకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు ఎవరు, ఎక్కడ, ఏ తప్పు చేసినా ఆధారాలతో పట్టుకునే పరిస్థితి రావాలన్నారు. ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు.

