Wednesday, 11 March 2026
  • Home  
  • అవిలాల చెరువును తిరుపతి ప్రజల కోసం అద్భుతంగా తీర్చిదిద్దుతాం: తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
- తిరుపతి

అవిలాల చెరువును తిరుపతి ప్రజల కోసం అద్భుతంగా తీర్చిదిద్దుతాం: తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ,తిరుపతి జిల్లా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుడా ఆధ్వర్యంలో అవిలాల చెరువు అభివృద్ధి పనులను అత్యంత వేగంగా చేపడుతున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన అవిలాల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో మూడు నెలల సమయం పట్టే జంగిల్ క్లియరెన్స్ (చెత్తాచెదారం, పిచ్చి మొక్కల తొలగింపు) పనులను కేవలం ఒక్క నెలలోనే పూర్తి చేశామని తెలిపారు. పేరూరు తుమ్మలగుంట చెరువు నుంచి వచ్చే ఓవర్‌ఫ్లో నీరు మరియు డైరీ పక్కన పశ్చిమ దిశ నుండి వచ్చే ఇన్‌ఫ్లో ద్వారా అవిలాల చెరువు నిండుతుందని తెలిపారు. సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుకు సంబంధించి 14 మీటర్ల వెడల్పు గల బండ్ (గట్టు) నిర్మాణం చేపట్టనున్నారు. దీని కనీస వెడల్పు 3 మీటర్లు ఉండగా, ఎత్తు 5 మీటర్లుగా నిర్ణయించమన్నారు. తిరుపతి నగర మరియు చుట్టుపక్కల ప్రజల కోసం ఇక్కడ ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, స్పోర్ట్స్ ఏరియా మరియు అందమైన గార్డెనింగ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. చెరువులోని నీటిని కలుషితం కాకుండా కాపాడటమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. తుడా మరియు నీటిపారుదల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బడ్జెట్ అంచనాల ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు ముగించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఛైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య, ఏఈ భవ్య, ఇరిగేషన్ ఈ ఈ ప్రసాద్, ఏ ఈ, రెవెన్యూ,తుడా అధికారులకు, తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి ,తిరుపతి జిల్లా

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తుడా ఆధ్వర్యంలో అవిలాల చెరువు అభివృద్ధి పనులను అత్యంత వేగంగా చేపడుతున్నట్లు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు.
బుధవారం ఆయన అవిలాల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
గతంలో మూడు నెలల సమయం పట్టే జంగిల్ క్లియరెన్స్ (చెత్తాచెదారం, పిచ్చి మొక్కల తొలగింపు) పనులను కేవలం ఒక్క నెలలోనే పూర్తి చేశామని తెలిపారు.
పేరూరు తుమ్మలగుంట చెరువు నుంచి వచ్చే ఓవర్‌ఫ్లో నీరు మరియు డైరీ పక్కన పశ్చిమ దిశ నుండి వచ్చే ఇన్‌ఫ్లో ద్వారా అవిలాల చెరువు నిండుతుందని తెలిపారు.

సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువుకు సంబంధించి 14 మీటర్ల వెడల్పు గల బండ్ (గట్టు) నిర్మాణం చేపట్టనున్నారు. దీని కనీస వెడల్పు 3 మీటర్లు ఉండగా, ఎత్తు 5 మీటర్లుగా నిర్ణయించమన్నారు.

తిరుపతి నగర మరియు చుట్టుపక్కల ప్రజల కోసం ఇక్కడ ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్, స్పోర్ట్స్ ఏరియా మరియు అందమైన గార్డెనింగ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

చెరువులోని నీటిని కలుషితం కాకుండా కాపాడటమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు.

తుడా మరియు నీటిపారుదల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బడ్జెట్ అంచనాల ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు ముగించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఛైర్మన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య, ఏఈ భవ్య, ఇరిగేషన్ ఈ ఈ ప్రసాద్, ఏ ఈ, రెవెన్యూ,తుడా అధికారులకు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.