అమలాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ 150 సంవత్సరాల మహోత్సవ వేడుకలుగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ హాజరయ్యారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ, స్కూల్ చరిత్రాత్మక ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ ఆమె మాట్లాడారు. విద్య రంగంలో ప్రభుత్వ పాఠశాలలు చూపుతున్న పురోగతిని అభినందించిన అనురాధ గారు, భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించేందుకు అందరూ కలిసి పని చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు.

అమలాపురం జెడ్పీ హై స్కూల్ 150 ఏళ్ల వేడుకలకు హాజరైన మాజీ ఎంపీ చింతా అనురాధ