శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా లభించడంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయని నాయకులు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో అనిశ్చితిలో నిలిచిన అమరావతి భవిష్యత్ ఇక ప్రకాశవంతంగా మారబోతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026’కు లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలపగా, అనంతరం రాష్ట్రపతి సంతకం చేయడంతో కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా గుర్తించినట్లు వెల్లడైంది. అలాగే సీఆర్‌డీఏ పరిధిలోని ప్రాంతమంతా రాజధాని పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్తరాశివారి పాలెంలో ఉన్న శ్రీ కరిమారియమ్మ దేవస్థానంలో నోటిఫికేషన్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమరావతి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డా. జి. దశరథాచారి, వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి మాట్లాడుతూ, అమరావతికి చట్టబద్ధ రక్షణ కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాన్ని సాకారం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సలహా మండలి సభ్యులు యం. సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. ఉమేష్ రావు, సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ డి.వి. నారాయణ, పట్టణ నాయకులు వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, చిల్లకూరు మణి, చంద్రకళ, కృష్ణమూర్తి, శివారెడ్డి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

అమరావతికి చట్టబద్ధత – కొత్త దిశలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి