Monday, 16 March 2026
  • Home  
  • అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా నిర్వహణ
- అన్నమయ్య

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా నిర్వహణ

అమరజీవి 125వ జయంతి సందర్భంగా నందలూరులో లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీ బచ్చు జయ భాస్కరరావు అధ్యక్షత వహించారు. అరవపల్లి బచ్చు భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ జయ భాస్కరరావు శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు గారు చేసిన త్యాగం అపారమని తెలిపారు. ఆయన 53 రోజులపాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఈ త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆంధ్రులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్యవైశ్య ప్రతినిధి ఎంబలూరు ప్రదీప్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన శ్రీరాములు కొంతకాలం రైల్వే శాఖలో ఉద్యోగం చేశారని తెలిపారు. అనంతరం గాంధేయవాదిగా మారి అస్పృశ్యత నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఆత్మార్పణను ఈ సందర్భంగా స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్ కుర్ర మణి యాదవ్, ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, గంధం గంగాధర్, గురు ప్రసాద్, బూశెట్టి వెంకటసుబ్బయ్య (నీటి సంఘం అధ్యక్షులు), మంటి మారయ్య, సునీల్ రెడ్డి, త్యాగరాజు, విస్డం స్కూల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

అమరజీవి 125వ జయంతి సందర్భంగా నందలూరులో లయన్స్ క్లబ్ మరియు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీ బచ్చు జయ భాస్కరరావు అధ్యక్షత వహించారు. అరవపల్లి బచ్చు భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభా ఎరుడైట్ స్కూల్ చైర్మన్ జయ భాస్కరరావు శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మన్నెం రామమోహన్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం శ్రీరాములు గారు చేసిన త్యాగం అపారమని తెలిపారు. ఆయన 53 రోజులపాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. ఈ త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆంధ్రులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
ఆర్యవైశ్య ప్రతినిధి ఎంబలూరు ప్రదీప్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన శ్రీరాములు కొంతకాలం రైల్వే శాఖలో ఉద్యోగం చేశారని తెలిపారు. అనంతరం గాంధేయవాదిగా మారి అస్పృశ్యత నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన ఆత్మార్పణను ఈ సందర్భంగా స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో లయన్ కుర్ర మణి యాదవ్, ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, గంధం గంగాధర్, గురు ప్రసాద్, బూశెట్టి వెంకటసుబ్బయ్య (నీటి సంఘం అధ్యక్షులు), మంటి మారయ్య, సునీల్ రెడ్డి, త్యాగరాజు, విస్డం స్కూల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.