Wednesday, 30 July 2025
  • Home  
  • అభిమానానికి ప్రతిఫలం లభిస్తుంది : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ
- Featured

అభిమానానికి ప్రతిఫలం లభిస్తుంది : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ

ఎన్నికల్లో మీరు చూపిన అభిమానానికి తప్పకుండా ప్రతిఫలం ఇచ్చి ఋణం తీర్చుకుంటానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు లో శనివారం జరిగిన సన్మాన సభలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి లను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ ప్రాంత ప్రజలు తమ పట్ల ఆదరణ అభిమానాన్ని. చూపి గెలిపించారని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేము కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని అభివృద్ధి పనులు చెప్పినట్లుగానే చేసి చూపుతామని తెలిపారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి తన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, పేట విరామంలో 10 వేల ఆర్థిక సాయం, మత్స్యకారులకు ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారాన్ని 10 లక్షలకు పెంచడం అమలు చేసి వారికి ఎంతో ఉపకారం చేశారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మత్స్యకారుల బాధలను గమనించి ఇవన్నీ అమలు చేశారని తెలిపారు. రానున్న కాలంలో పెన్షన్ 3000 వేలకు పెంచ నున్నారని పేర్కొన్నారు .పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పట్టుబట్టి అమలు చేయనున్నారని చెప్పారు. స్థానికంగా నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు .స్థానిక యువనేత కళ్యాణ్ రెడ్డి అడిగిన రోడ్లు మంచినీటి పథకానికి నిధులు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి అధ్యక్షత వహించారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లను మత్స్యకారులు ఆక్వా రైతులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక నేత కళ్యాణ్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అంతకుముందు మైపాడు అంతర్గత రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలతో ఎమ్మెల్యే ఎంపీ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి అబూబకర్ చాంద్ భాషా శ్రీనివాసులురెడ్డి , దువ్వూరు రాధాకృష్ణారెడ్డి , గును పాటి రమేష్ రెడ్డి నూనె మల్లికార్జున యాదవ్ షబ్బీర్ బలరాం రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఎన్నికల్లో మీరు చూపిన అభిమానానికి తప్పకుండా ప్రతిఫలం ఇచ్చి ఋణం తీర్చుకుంటానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు లో శనివారం జరిగిన సన్మాన సభలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి లను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ ప్రాంత ప్రజలు తమ పట్ల ఆదరణ అభిమానాన్ని. చూపి గెలిపించారని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేము కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని అభివృద్ధి పనులు చెప్పినట్లుగానే చేసి చూపుతామని తెలిపారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి తన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, పేట విరామంలో 10 వేల ఆర్థిక సాయం, మత్స్యకారులకు ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారాన్ని 10 లక్షలకు పెంచడం అమలు చేసి వారికి ఎంతో ఉపకారం చేశారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో మత్స్యకారుల బాధలను గమనించి ఇవన్నీ అమలు చేశారని తెలిపారు. రానున్న కాలంలో
పెన్షన్ 3000 వేలకు పెంచ నున్నారని పేర్కొన్నారు .పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పట్టుబట్టి అమలు చేయనున్నారని చెప్పారు. స్థానికంగా నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించాలని చెప్పారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడానికి అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు .స్థానిక యువనేత కళ్యాణ్ రెడ్డి అడిగిన రోడ్లు మంచినీటి పథకానికి నిధులు ఇస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి అధ్యక్షత వహించారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లను మత్స్యకారులు ఆక్వా రైతులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక నేత కళ్యాణ్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అంతకుముందు మైపాడు అంతర్గత రోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలతో ఎమ్మెల్యే ఎంపీ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి అబూబకర్ చాంద్ భాషా శ్రీనివాసులురెడ్డి , దువ్వూరు రాధాకృష్ణారెడ్డి , గును పాటి రమేష్ రెడ్డి నూనె మల్లికార్జున యాదవ్ షబ్బీర్ బలరాం రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.