Wednesday, 4 March 2026
  • Home  
  • అన్నాసముద్రంలో టిడిపి నాయకులను కలిసిన కె కె చౌదరి — కేసులపై చర్చ, న్యాయం చేస్తామని హామీ
- అన్నమయ్య

అన్నాసముద్రంలో టిడిపి నాయకులను కలిసిన కె కె చౌదరి — కేసులపై చర్చ, న్యాయం చేస్తామని హామీ

కె కె చౌదరి గారు పుల్లంపేట మండలం అన్నాసముద్రంలో టిడిపి నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసిపి నాయకుల రౌడీయిజం, దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని పార్టీ పట్ల అంకితభావంతో నిలబడ్డ టిడిపి నాయకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జీ ముద్దా సుభాష్ రెడ్డి (గంగిరెడ్డి) గారు, ముద్దా సుబ్బా రెడ్డి గారు, ముద్దా లక్ష్మీనరసమ్మ గారు, ఆకేపాటి జయరాం రెడ్డి గారు, దేశు వెంకటరెడ్డి గారు మరియు నక్కల సుబ్రమణ్యం గారిని ప్రత్యేకంగా కలుసుకుని, వారు గత పది సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పలు కేసులు మరియు ఇబ్బందులపై చర్చించారు.నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా విన్న కె కె చౌదరి గారు, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ నాయకులు చేసిన త్యాగాలను ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కె కె చౌదరి గారు పుల్లంపేట మండలం అన్నాసముద్రంలో టిడిపి నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసిపి నాయకుల రౌడీయిజం, దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని పార్టీ పట్ల అంకితభావంతో నిలబడ్డ టిడిపి నాయకులను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా క్లస్టర్ ఇంచార్జీ ముద్దా సుభాష్ రెడ్డి (గంగిరెడ్డి) గారు, ముద్దా సుబ్బా రెడ్డి గారు, ముద్దా లక్ష్మీనరసమ్మ గారు, ఆకేపాటి జయరాం రెడ్డి గారు, దేశు వెంకటరెడ్డి గారు మరియు నక్కల సుబ్రమణ్యం గారిని ప్రత్యేకంగా కలుసుకుని, వారు గత పది సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న పలు కేసులు మరియు ఇబ్బందులపై చర్చించారు.నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా విన్న కె కె చౌదరి గారు, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా, ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ నాయకులు చేసిన త్యాగాలను ఆయన ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.