
మన ఊరు.. మన బాధ్యతలో భాగముగా, మెంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో, నగరంలో అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశ్యంతో, కోరాడవారి వీధికి చెందిన చిరువ్యాపారి కోరాడ.రమణ, కుమారి దంపతులు ముందుకువచ్చి నగరంలో పలు చోట్ల, నిరుపేదలకు ఆహారాన్నందించారు.
స్థానిక గొంటి వీధిలో నిరాశ్రయులకు ఆహారాన్నందించి మాట్లాడుతూ మన ఊరు.. మన బాధ్యతను సేవకులు ఉర్లం.శివతేజ వివరించారని, ఆయన పిలుపుమేరకు, వారి సోదరులు కుప్పిలి.ఉపాధ్యాయులు ఉర్లం.రవితేజ సహకారంతో ఇంతటి వర్షంలోనూ, అన్నప్రసాదవితరణ చేపట్టామని, ఇక్కడ ఉండే పేదలకు నిరంతరం సేవ చేస్తున్న కథనాలను చూస్తున్నామని, తుఫాన్ ప్రభావంతో ఆహారం దొరక ఇబ్బందిపడతారనే విషయాన్ని గమనించి మా వంతు సహాయం అందించామని తెలిపారు.
అన్నవితరణలో నిస్సహాయులు, నిరాశ్రయులు, సహాయకులు ఉర్లం.రవితేజ్, నేటి దాతలు కోరాడ రమణ, దంపతులు, కుమారుడి, కుమార్తె, పాల్గొన్నారు.

