అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 21(పున్నమి ప్రతినిధి)
నేడు ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో రాబోయే రోజుల్లో రైతులకు నీటి వనరులను మరియు నీటి లభ్యత కేటాయింపులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి. సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పచ్చి కరువు వచ్చి పత్తి రైతులాకు జరుగుతున్న నష్టంపై అధికారులతో చర్చించారు అలాగే వచ్చే రబీ సీజన్లో వారికి బ్లాక్ గ్రామ్ మినీ కిట్లు అందించి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు. అలాగే గత ప్రభుత్వంలో ఉల్లి రైతులకు జరిగిన నష్టం మన ప్రభుత్వంలో జరగకూడదని తగిన మద్దతు ధర అందేలా చూడాలని అధికారులని ఆదేశించారు.అలాగే రాబోయే రోజుల్లో వచ్చే నీటి సామర్థ్యాన్ని బట్టి తాగునీటి సమస్యను ఎదుర్కోకుండా నియోజకవర్గ వ్యాప్తంగా సరిపడే నీటి నిల్వపై అధికారులు దృష్టి సారించాలి అని ఎమ్మెల్యే అధికారులను కోరారు.


