చేజర్ల సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం చేజర్ల గ్రామంలో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి బి. జ్యోత్స్న మాట్లాడుతూ అధిక యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపారు. నీరు మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు. కనుక సేంద్రియ ఎరువుల వాడి యూరియా వినియోగం తగ్గించాలని సూచించారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసినట్లయితే నేల గుల్ల బారి పోషకాలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా పి ఎమ్ డి ఎస్ కిట్ వినియోగిస్తే 365 రోజులు నేలను పచ్చగా ఉంచుటకు వీలుగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ, సుజాత, జడ్ బి ఎన్ ఎఫ్ సుబ్బయ్య, విఎఎలు చెంచయ్య, మేఘన, మరియు పొదుపు సంఘ మహిళ మరియు రైతులు పాల్గొన్నారు.


