Monday, 8 December 2025
  • Home  
  • అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో చంద్ర‌బాబుకు మూడో స్థానం
- ఆంధ్రప్రదేశ్

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో చంద్ర‌బాబుకు మూడో స్థానం

మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట ‘ఇండియా టుడే’ స‌ర్వే దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాల సీఎంల ప‌నితీరుపై స‌ర్వే ఈ స‌ర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు ప్ర‌థ‌మ స్థానం మ‌మ‌తా బెన‌ర్జీ, చంద్రబాబుల‌కు వ‌రుస‌గా రెండు, మూడు ర్యాంకులు ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో చంద్ర‌బాబు మూడో స్థానం ద‌క్కించుకున్నారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాల సీఎంల ప‌నితీరుపై ‘ఇండియా టుడే’ స‌ర్వే నిర్వ‌హించింది. ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ 36 శాతం జ‌నామోదంతో ప్ర‌థ‌మ స్థానంలో నిలిస్తే.. 12.5 శాతంతో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ద్వితీయ‌ స్థానంలో నిలిచారు. అలాగే చంద్ర‌బాబు 7.3 శాతం జ‌నామోదంతో మూడో స్థానంలో ఉన్నారు. బిహార్ సీఎం (4.3 శాతం), త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ (3.8 శాతం) వ‌రుస‌గా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించిన ఇదే స‌ర్వేలో చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నారు. ఇక‌, ‘ఇండియా టుడే’ 2001 నుంచి ఏడాదిలో రెండు సార్లు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌నితీరుపై ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట స‌ర్వే నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకుంటోంది.

మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట ‘ఇండియా టుడే’ స‌ర్వే

దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాల సీఎంల ప‌నితీరుపై స‌ర్వే

ఈ స‌ర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు ప్ర‌థ‌మ స్థానం

మ‌మ‌తా బెన‌ర్జీ, చంద్రబాబుల‌కు వ‌రుస‌గా రెండు, మూడు ర్యాంకులు

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @
దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీఎంల‌లో చంద్ర‌బాబు మూడో స్థానం ద‌క్కించుకున్నారు. దేశంలోని 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర‌పాలిత ప్రాంతాల సీఎంల ప‌నితీరుపై ‘ఇండియా టుడే’ స‌ర్వే నిర్వ‌హించింది. ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ 36 శాతం జ‌నామోదంతో ప్ర‌థ‌మ స్థానంలో నిలిస్తే.. 12.5 శాతంతో ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ద్వితీయ‌ స్థానంలో నిలిచారు. అలాగే చంద్ర‌బాబు 7.3 శాతం జ‌నామోదంతో మూడో స్థానంలో ఉన్నారు.

బిహార్ సీఎం (4.3 శాతం), త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ (3.8 శాతం) వ‌రుస‌గా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించిన ఇదే స‌ర్వేలో చంద్ర‌బాబు ఐదో స్థానంలో ఉన్నారు. ఇక‌, ‘ఇండియా టుడే’ 2001 నుంచి ఏడాదిలో రెండు సార్లు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌నితీరుపై ‘మూడ్ ఆఫ్ ద నేష‌న్’ పేరిట స‌ర్వే నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకుంటోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.