కామారెడ్డి,17 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, సధాశివ నగర్ మండల కేంద్రం తో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, మహాత్మా జ్యోతిబా పూలే కుప్రియాల్ పాఠశాలల్లో బంగారు తల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాసులు ఘనంగా నిర్వాహించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వా సం, క్రమశిక్షణ పెంచే ఈ కార్యక్రమం సూపర్ హిట్!ఇంపాక్ట్ ట్రైనర్స్ వజ్జా నవనీత, వజ్జా మహేందర్, మర్రి సదాశివరెడ్డిలు ‘లక్ష్య నిర్ధారణ, కాల నిర్వహ ణ, వ్యక్తిత్వ వికాసం’ అంశాలపై ప్రేరణాత్మక సెషన్లు నడిపారు. విద్యార్థులు ఈ శిక్షణతో లక్ష్యాలు సాధించే మార్గం తెలుసుకుని ఉత్సాహంగా ఉన్నారు! పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ,ఇది భవిష్యత్తుకు సూపర్ బూస్ట్! ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల ని అన్నారు. ఉత్తమ విద్యార్థులకు మెమెంటోలు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇంపా క్ట్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్ష మర్రి సదాశివరెడ్డి, బంగారు తల్లి ఫౌండేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ట్రైనర్స్ వజ్జా నవనీత, వజ్జా మహేందర్ ముఖ్యంగా పాల్గొన్నారు.


