తిరునాళ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి..!
ఎమ్మెల్యే జూలకంటి..
దుర్గి:
మండల పరిధిలోని అడిగొప్పల శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా వేలాదిగా తరలివస్తున్న భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తిరునాళ్లకు సంబంధించిన గోడ ప్రతులను, ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.., పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వసతి, తాగునీరు వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఆదిశేషు నాయుడు, ఆలయ ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

