పున్నమి ప్రతినిధి నిర్మల్ జనవరి 12:
ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రింట్- ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా కొనసాగుతోంది. ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం మాజీ ఎంపీటీసీ మాక్ధూమ్, మాజీ ఉప సర్పంచ్ సుభాష్ టాస్ ఎగురవేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు.అదే విధంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని పలు పట్టణాలకు చెందిన క్రికెట్ జట్లు సైతం పాల్గొంటూ గట్టి పోటీనిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో క్రికెట్ పోటీలు విద్యార్థులు, యువకులకు కనువిందు చేస్తున్నాయి. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. ప్రతిరోజు నాలుగు మ్యాచ్లు నిర్వహిస్తుండడంతో చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారు. క్రీడాకారులు సైతం ఎంతో ఉత్సాహంగా తమలోని క్రీడా నైపుణ్యాన్ని క్రికెట్ టోర్నీలో ప్రదర్శిస్తూ ఆహా అనిపిస్తున్నారు. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధిక సంఖ్యలో క్రికెట్ జట్లు టోర్నీలో భాగస్వాములు అయ్యాయి.
క్రికెట్ టోర్ని క్రీడా పండుగను తలపిస్తుంది. వారం రోజులపాటు జరిగే క్రీడా సంబరాలు విద్యార్థులు- యువకులు-స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. సెలవుల్లో మరిన్ని టోర్నీలను నిర్వహించి గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసి జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించే వేదికగా మార్చాలని స్థానికులు ఆకాంక్షించారు. నిర్వాహకులు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ నాయకులు తాటేవర్ రమేష్, ధర్మపురి శ్రీనివాస్,మదన్ పటేల్, గంగాధర్,మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా సాగుతున్న మీడియా క్రికెట్ టోర్నీ
పున్నమి ప్రతినిధి నిర్మల్ జనవరి 12: ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రింట్- ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా కొనసాగుతోంది. ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన క్రికెట్ జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం మాజీ ఎంపీటీసీ మాక్ధూమ్, మాజీ ఉప సర్పంచ్ సుభాష్ టాస్ ఎగురవేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు.అదే విధంగా పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని పలు పట్టణాలకు చెందిన క్రికెట్ జట్లు సైతం పాల్గొంటూ గట్టి పోటీనిస్తున్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో క్రికెట్ పోటీలు విద్యార్థులు, యువకులకు కనువిందు చేస్తున్నాయి. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి దోహదపడతాయి. ప్రతిరోజు నాలుగు మ్యాచ్లు నిర్వహిస్తుండడంతో చూడడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారు. క్రీడాకారులు సైతం ఎంతో ఉత్సాహంగా తమలోని క్రీడా నైపుణ్యాన్ని క్రికెట్ టోర్నీలో ప్రదర్శిస్తూ ఆహా అనిపిస్తున్నారు. నిర్వాహకులు ఆశించిన స్థాయి కంటే అధిక సంఖ్యలో క్రికెట్ జట్లు టోర్నీలో భాగస్వాములు అయ్యాయి. క్రికెట్ టోర్ని క్రీడా పండుగను తలపిస్తుంది. వారం రోజులపాటు జరిగే క్రీడా సంబరాలు విద్యార్థులు- యువకులు-స్థానికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. సెలవుల్లో మరిన్ని టోర్నీలను నిర్వహించి గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసి జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించే వేదికగా మార్చాలని స్థానికులు ఆకాంక్షించారు. నిర్వాహకులు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అఫ్రోజ్ ఖాన్, బీజేపీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, మాజీ ఎంపీటీసీ దేవోజీ భూమేష్ నాయకులు తాటేవర్ రమేష్, ధర్మపురి శ్రీనివాస్,మదన్ పటేల్, గంగాధర్,మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

