విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి
*అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)* **ఆంధ్ర యూనివర్సిటీ కమిటీ**
ఏ.ఐ.ఎస్.ఎఫ్ బస్సు యాత్ర గోడ పత్రికలు ఆవిష్కరణ.
*విశాఖలో 24, 25 తేదీలలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు.*
విద్యారంగ సమస్యలు పరిష్కారానీకై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర.
*ఆంధ్ర యూనివర్సిటీ* : ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ శాతవాహన హాస్టల్ వద్ద ఏ.ఐ.ఎస్.ఎఫ్ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో బస్సుయాత్ర గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏ.ఐ.ఎస్.ఎఫ్ ) కార్యదర్శి జెట్టి.అభిషేక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగా సమస్యలు పరిష్కారానికై ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు ఏ.ఐ.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బస్సు యాత్ర ఈ నెల 22 తారీకుర శ్రీకాకుళంలో మొదలై 24 ,25 వ తారీఖులలో విశాఖపట్నంలో పర్యటిస్తుందని 24 సాయంత్రం 3గంటలకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేయబోతున్న భారీ బహిరంగ సభలో రాష్ట్ర నాయకత్వం పాల్గొంటారని అలాగే 25 వ తారీఖున గాజువాకలో కూడా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బస్సు యాత్రలో రాష్ట్రంలో పి.పి.పి పేరుతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల , పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయాలని, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థులు ఎదుర్కొంటున్న తదితర సమస్యలపై మాట్లాడటం జరుగుతుందని తెలిపారు. కావున విద్యార్థులందరూ 24, 25వ తేదీలలో జరగబోయే బస్సు యాత్రను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు పవన్ కళ్యాణ్, హరి,చింటూ, రాజేష్,దిలీప్ ,సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.


