Sunday, 22 March 2026
  • Home  
  • అక్రమ టపాసుల గోడౌన్‌పై సి ఐ మురళీకృష్ణ ఉక్కుపాదం
- తిరుపతి

అక్రమ టపాసుల గోడౌన్‌పై సి ఐ మురళీకృష్ణ ఉక్కుపాదం

సూళ్లూరుపేట అక్టోబర్ పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కోటపోలూరు రోడ్డు లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన భారీ టపాసుల గోడౌన్‌పై CI మురళీకృష్ణ ఆధ్వర్యంలోని పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో 85 బాక్స్ లు వీటి విలువ సుమారు గా 2,5000/- ప్రమాదకర టపాసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూళ్లూరుపేట పట్టణం సమీపంలో కోటపోలూరు రోడ్డు వద్ద జనసాంద్రత గల ప్రాంతంలో ఒక గోడౌన్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి టపాసులను నిల్వ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన CI మురళీకృష్ణ, తన బృందంతో కలిసి గోడౌన్‌పై మెరుపు దాడి చేశారు. దాడి సమయంలో, గోడౌన్‌లో టపాసులు భారీ పరిమాణంలో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఇవి నిల్వ చేసిన విధానం అత్యంత ప్రమాదకరంగా ఉందని, చిన్నపాటి నిప్పు రవ్వ తగిలినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ గోడౌన్ సమీపంలో నివాస గృహాలు ఉండటంతో, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి గోడౌన్ లో టపాసులు అక్రమ నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న టపాసుల విలువ సుమారు రెండు లక్షల యాభై వేలు రూపాయలు ఉంటుందని అంచనా.CI మురళీకృష్ణ మాట్లాడుతూ, “ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. అక్రమంగా టపాసులు నిల్వ ఉంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని” ప్రజలను కోరారు. ఈ దాడులతో సూళ్లూరుపేట ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పండుగల సీజన్‌లో ఇలాంటి అక్రమ గోడౌన్‌లు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.అక్రమ టపాసులు నిల్వ సమాచారం రాగానే ఎంతో చాకచక్యంగా వారిని పట్టుకున్నందుకు పట్టణ ప్రజలు పోలీస్ వారిని మెచ్చుకుంటున్నారు.

సూళ్లూరుపేట అక్టోబర్ పున్నమి ప్రతినిధి

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కోటపోలూరు రోడ్డు లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన భారీ టపాసుల గోడౌన్‌పై CI మురళీకృష్ణ ఆధ్వర్యంలోని పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో 85 బాక్స్ లు వీటి విలువ సుమారు గా 2,5000/- ప్రమాదకర టపాసులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూళ్లూరుపేట పట్టణం సమీపంలో కోటపోలూరు రోడ్డు వద్ద జనసాంద్రత గల ప్రాంతంలో ఒక గోడౌన్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి టపాసులను నిల్వ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన CI మురళీకృష్ణ, తన బృందంతో కలిసి గోడౌన్‌పై మెరుపు దాడి చేశారు.

దాడి సమయంలో, గోడౌన్‌లో టపాసులు భారీ పరిమాణంలో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఇవి నిల్వ చేసిన విధానం అత్యంత ప్రమాదకరంగా ఉందని, చిన్నపాటి నిప్పు రవ్వ తగిలినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ గోడౌన్ సమీపంలో నివాస గృహాలు ఉండటంతో, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి గోడౌన్ లో టపాసులు అక్రమ నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న టపాసుల విలువ సుమారు రెండు లక్షల యాభై వేలు రూపాయలు ఉంటుందని అంచనా.CI మురళీకృష్ణ మాట్లాడుతూ, “ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. అక్రమంగా టపాసులు నిల్వ ఉంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటివి ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని” ప్రజలను కోరారు.

ఈ దాడులతో సూళ్లూరుపేట ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పండుగల సీజన్‌లో ఇలాంటి అక్రమ గోడౌన్‌లు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది.అక్రమ టపాసులు నిల్వ సమాచారం రాగానే ఎంతో చాకచక్యంగా వారిని పట్టుకున్నందుకు పట్టణ ప్రజలు పోలీస్ వారిని మెచ్చుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.