అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎపి ఎన్జీజివో అడహక్ కమిటీ నూతన చైర్మన్ గా మాధవరపు
అమలాపురం, అక్టోబరు 11 (తూర్పు ఉదయం విలేఖరి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ అడహాక్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఏపీ ఎన్జీజి జి వో రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర కార్యదర్శి డివి రమణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, ఎన్జీజివో కార్యవర్గ సభ్యులు మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్ల సంఘాల సమక్షంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీజివో అసోసియేషన్ అడహాక్ కమిటీ నూతన చైర్మన్ గా అమలాపురం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం నందు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న మాధవరపు వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాగా మాధవరపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారామెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు గత 20సంవత్సరాలు గా రామచంద్రపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. అలాగే కన్వీనర్ గా.. వాటర్స్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గుత్తుల వెంకటేశ్వరావును ఎన్నుకోవడం జరిగింది. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేష్ సింగ్ ఫైనాన్స్ అసిస్టెంట్ గా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఇ. యేసు బాబుని కో చైర్మన్ గాను, బి.రవి, సిహెచ్ చిట్టిబాబు, రూతమ్మ లను సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ త్వరలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు యూనిట్లకు ఎలక్షన్ జరిపించే పటిష్టమైన జిల్లా కార్యవర్గాన్ని సైతం ఏర్పాటు చేసుకుని ఉద్యోగుల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న పిఆర్సి కమిషన్ ఏర్పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సచివాలయ ఉద్యోగుల నేషనల్ ఇంక్రిమెంట్స్ కోసం, ప్రభుత్వం నుంచి రావలసిన 5 డిఏ బకాయిలు, ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించవలసిన సుమారు 30 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని, తదితర సమస్యలపై రాష్ట్ర సంఘంతో కలిసి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన తెలియజేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎపి ఎన్జీజివో అడహక్ కమిటీ నూతన చైర్మన్ గా మాధవరపు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎపి ఎన్జీజివో అడహక్ కమిటీ నూతన చైర్మన్ గా మాధవరపు అమలాపురం, అక్టోబరు 11 (తూర్పు ఉదయం విలేఖరి) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ అడహాక్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఏపీ ఎన్జీజి జి వో రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర కార్యదర్శి డివి రమణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, ఎన్జీజివో కార్యవర్గ సభ్యులు మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, పెన్షనర్ల సంఘాల సమక్షంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఎన్జీజివో అసోసియేషన్ అడహాక్ కమిటీ నూతన చైర్మన్ గా అమలాపురం డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం నందు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న మాధవరపు వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాగా మాధవరపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారామెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు గత 20సంవత్సరాలు గా రామచంద్రపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. అలాగే కన్వీనర్ గా.. వాటర్స్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గుత్తుల వెంకటేశ్వరావును ఎన్నుకోవడం జరిగింది. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేష్ సింగ్ ఫైనాన్స్ అసిస్టెంట్ గా ఎన్నికయ్యారు. వీరితోపాటు ఇ. యేసు బాబుని కో చైర్మన్ గాను, బి.రవి, సిహెచ్ చిట్టిబాబు, రూతమ్మ లను సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ త్వరలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు యూనిట్లకు ఎలక్షన్ జరిపించే పటిష్టమైన జిల్లా కార్యవర్గాన్ని సైతం ఏర్పాటు చేసుకుని ఉద్యోగుల సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న పిఆర్సి కమిషన్ ఏర్పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సచివాలయ ఉద్యోగుల నేషనల్ ఇంక్రిమెంట్స్ కోసం, ప్రభుత్వం నుంచి రావలసిన 5 డిఏ బకాయిలు, ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించవలసిన సుమారు 30 వేల కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని, తదితర సమస్యలపై రాష్ట్ర సంఘంతో కలిసి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన తెలియజేశారు.

