Friday, 27 March 2026
  • Home  
  • అంతర్జాతీయ అతిథులు విచ్చేయున్నందున విశాఖ మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి.
- విశాఖపట్నం

అంతర్జాతీయ అతిథులు విచ్చేయున్నందున విశాఖ మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి.

విశాఖ వేదికగా ఫిబ్రవరిలో ఐ ఎఫ్ ఆర్ కార్యక్రమం. *అంతర్జాతీయ అతిథులు విచ్చేయున్నందున విశాఖ మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* విశాఖ నగరంలో విశాఖ వేదికగా ఘనంగా 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ( ఐ ఎఫ్ ఆర్ ) కార్యక్రమం జరుగనున్నందున అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల అతిథులు, ప్రతినిధులు విశాఖలో విహరించనున్నారని ,విశాఖ మ్యూజియం ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ కు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో విశాఖ మ్యూజియం అంతటా కలియతిరిగి పరిశీలించారు. ఈ పరిశీలనలో కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో విశాఖ నగరంలో జరుగునున్న అంతర్జాతీయ వేదికగా ఐ ఎఫ్ ఆర్ కార్యక్రమం జరుగనున్నదని , ఈ విషయమై ఎపెక్స్ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ లో నేవల్ అధికారులు పలు విషయాలను, అతిథులు సందర్శించవలసిన ప్రాంతాలను ప్రస్తావించారన్నారు. ఈ కార్యక్రమానికి దేశ ,విదేశాల నుండి అధిక సంఖ్యలో నేవల్ అధికారులు, ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ముఖ్య అతిథులు విశాఖ నగరంలో పలు ప్రాంతాలను సందర్శిస్తారన్నారు. అందుకు జీవీఎంసీ నిర్వహిస్తున్న విశాఖ మ్యూజియంను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, మ్యూజియంలో ఉన్న ప్రదర్శనలను అన్ని వివరాలతో క్రమ పద్ధతిలో ప్రదర్శనకు ఏర్పాటు చేయాలన్నారు. మ్యూజియంలో ప్రదర్శించిన అన్ని వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పరిశుభ్రత పనులు చేపట్టాలని,అవసరమగు మరమ్మత్తులు, ల్యాండ్ స్కాపింగ్, గార్డెన్ అభివృద్ధి పనులు, పెయింటింగులు, లైటింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, అలాగే డ్రింకింగ్ వాటర్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి విశాఖ మ్యూజియంలో గల మేరీ టైం, హెరిటేజ్ మ్యూజియం లను అతిథులు, ప్రతినిధులను ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దాలని , త్వరితగతిన అవసరమగు పనులను పూర్తి చేయాలని ప్రధాన ఇంజనీరు పి వి వి సత్యనారాయణ రాజుకు కమిషనర్ ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీరు గంగాధర్, సహాయక ఇంజనీరు తదితరులు పాల్గొన్నారు

విశాఖ వేదికగా ఫిబ్రవరిలో ఐ ఎఫ్ ఆర్ కార్యక్రమం.

*అంతర్జాతీయ అతిథులు విచ్చేయున్నందున విశాఖ మ్యూజియంను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి.

– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* విశాఖ నగరంలో విశాఖ వేదికగా ఘనంగా 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ( ఐ ఎఫ్ ఆర్ ) కార్యక్రమం జరుగనున్నందున అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల అతిథులు, ప్రతినిధులు విశాఖలో విహరించనున్నారని ,విశాఖ మ్యూజియం ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ కు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. మంగళవారం ఆయన జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో విశాఖ మ్యూజియం అంతటా కలియతిరిగి పరిశీలించారు.

ఈ పరిశీలనలో కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరిలో విశాఖ నగరంలో జరుగునున్న అంతర్జాతీయ వేదికగా ఐ ఎఫ్ ఆర్ కార్యక్రమం జరుగనున్నదని , ఈ విషయమై ఎపెక్స్ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ లో నేవల్ అధికారులు పలు విషయాలను, అతిథులు సందర్శించవలసిన ప్రాంతాలను ప్రస్తావించారన్నారు. ఈ కార్యక్రమానికి దేశ ,విదేశాల నుండి అధిక సంఖ్యలో నేవల్ అధికారులు, ప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ముఖ్య అతిథులు విశాఖ నగరంలో పలు ప్రాంతాలను సందర్శిస్తారన్నారు. అందుకు జీవీఎంసీ నిర్వహిస్తున్న విశాఖ మ్యూజియంను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, మ్యూజియంలో ఉన్న ప్రదర్శనలను అన్ని వివరాలతో క్రమ పద్ధతిలో ప్రదర్శనకు ఏర్పాటు చేయాలన్నారు. మ్యూజియంలో ప్రదర్శించిన అన్ని వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పరిశుభ్రత పనులు చేపట్టాలని,అవసరమగు మరమ్మత్తులు, ల్యాండ్ స్కాపింగ్, గార్డెన్ అభివృద్ధి పనులు, పెయింటింగులు, లైటింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, అలాగే డ్రింకింగ్ వాటర్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి విశాఖ మ్యూజియంలో గల మేరీ టైం, హెరిటేజ్ మ్యూజియం లను అతిథులు, ప్రతినిధులను ఆకర్షించేలా అందంగా తీర్చిదిద్దాలని , త్వరితగతిన అవసరమగు పనులను పూర్తి చేయాలని ప్రధాన ఇంజనీరు పి వి వి సత్యనారాయణ రాజుకు కమిషనర్ ఆదేశించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీరు గంగాధర్, సహాయక ఇంజనీరు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.