సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)
స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా తూర్పుపల్లి సచివాలయం పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు పిల్లల యొక్క తల్లిదండ్రులను మరియు గ్రామస్తులను భాగస్వాములుగా చేసి పోషకాహారం గురించి తెలియజేశారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి తల్లులు మరియు పిల్లలు పోషకాహారం మరియు సమతుల ఆహారం తీసుకునేలా ప్రతి ఒక్కరూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజే యడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమ్మి సిద్దుల నాయుడు, పీహెచ్ సి డాక్టర్, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి కార్యకర్తలు, ఎం ఎల్ హెచ్ పి లు, మరియు సూపర్వైజర్ ఎం పద్మ పాల్గొన్నారు.


