ఆగస్టు 28, పున్నమి ప్రతినిధి, జనగాం:
జాతీయ స్థాయి నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (NAS-2024) లో జనగాం జిల్లా 6వ తరగతి విభాగంలో 35వ ర్యాంక్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించిన సందర్భంగా, కలెక్టర్ శ్రీ రిజ్వాన్ బాషా షేక్, IAS గారు, అదనపు కలెక్టర్ శ్రీ పింకేష్ కుమార్, IAS గారు ZPHS ఏడునూతుల ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యాకయ్య గారిని, ఉపాధ్యాయులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ZPHS ఏడునూతుల (Kodakandla మండలం) ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యాకయ్య గారు, సిబ్బంది మరియు విద్యార్థులు కలెక్టర్, అదనపు కలెక్టర్ గారికి, అలాగే మండల విద్యా అధికారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
“హెడ్మాస్టర్ దూరదృష్టి మార్గం చూపితే, ఉపాధ్యాయుల కృషి ఆ మార్గంలో విజయదీపం వెలిగించింది” అని విద్యార్థులు పేర్కొన్నారు.
హెడ్మాస్టర్ శ్రీ నారబోయిన యాకయ్య గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ –
“ఈ విజయం మొత్తం సిబ్బంది కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం ఫలితం. జనగాం (మా పాఠశాల) జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చడం ప్రతి ఒక్కరికి గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి నిరంతరం శ్రమిస్తాం” అన్నారు.
ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులు:
కమల్ కుమార్, రాంబాబు,భాస్కర్, సోమేశ్వర్, యాదగిరి, G. రజిత, మమత, M. రజిత, విజయ, ఈర్య, కవిత.
అధికారుల ప్రోత్సాహం, మార్గదర్శకం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై చూపిన శ్రద్ధ వలననే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలు సాధించి, జిల్లా, రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని సంకల్పించారు.


