Sunday, 27 September 2026

Tag: విశాఖపట్నం పున్నమి న్యూస్

విశాఖపట్నం

తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించాము

గాజువాక నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన గాజువాక నియోజకవర్గం, షీలానగర్, హరిజన జగ్గయ్యపాలెంలో తుపాను ప్రభావిత ప్రాంతాలను గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు తో కలిసి పరిశీలించడం జరిగింది. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పరామర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాము. – మాకా శాలిని 68వ వార్డు జనసేన ఇన్చార్జ్, *గాజువాక నియోజకవర్గం*

విశాఖపట్నం

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాతయ్యపాలెం కృష్ణమహంతి చెరువు పక్కన ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరింది విషయాన్ని తెల్లవారుజామున 5 గంటలకే గమనించిన 69వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు సండ్రానా భాస్కర్ వెంటనే స్పందించారు. JCB సహాయంతో చెరువు గట్టుకు నాలుగు చోట్ల గండి కొట్టించి, ఇళ్లలోకి వచ్చిన వరద నీటిని తిరిగి చెరువులోకి మళ్లించారు. దీంతో ముంపు నుండి స్థానికులకు ఉపశమనం కలిగింది.

విశాఖపట్నం

ప్రధాని మోదీజీ జన్మదిన సేవా సంకల్ప ఉత్సవాలలో భాగంగా వడ్లపూడిలో ప్రత్యేక పూజలు.

వడ్లపూడి శ్రీ సీతారామలింగేశ్వర ఆలయంలోని పంచముఖ వినాయకుడికి 108 స్వీట్స్ తో సారె సమర్పణ. బీజేపీ జిల్లా నాయకులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వినాయక రూపంలో దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. మోదీజీ నిండు నూరేళ్లు జీవించాలని, భారత్ ను విశ్వగురువు చేయాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకతీతంగా మహిళలు, గ్రామ పెద్దలు, పిల్లలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బొండా యల్లాజీరావు మాట్లాడుతూ మోదీజీ 25 ఏళ్లుగా నీతివంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు. ప్రపంచ నేతలే మోదీజీని తమ బాస్, మార్గదర్శకుడిగా భావిస్తున్నారని కొనియాడారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బొండా జగన్, ఈర్లి శ్రీరాములు, మింది రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ నుండి మింది గోవింద, కర్రి కృష్ణ, మడక అప్పలరాజు పాల్గొన్నారు. మహిళా నాయకులు బొండా శ్రీదేవి, లక్ష్మి, సుజాత, మంగసత్య తదితరులు హాజరయ్యారు. భజన మండలి సభ్యులు కుమారి, పద్మ, షాలిని, విజయలక్ష్మి పాల్గొన్నారు.. అర్చకులు నరసింహమూర్తి, సత్యనారాయణలు మోదీజీ పేరున ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో కార్యక్రమం ఘనంగా ముగిసింది.

విశాఖపట్నం

: కూర్మాన్నపాలెం ప్రధాన రహదారిపై వీధి కుక్కల బెడద.. భయాందోళనలో స్థానికులు

విశాఖపట్నం: గాజువాక మండలం కూర్మాన్నపాలెం, రాజీవ్ నగర్ ప్రధాన రహదారిపై వీధి కుక్కల బెడద ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కన ఖాళీ స్థలంలో 8 నుండి 10 వరకు వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయని, వాహనదారులు, చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కుక్కలు వెంటపడుతున్నాయని, పలువురిపై దాడికి యత్నించాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపై చెత్త వేయడం వల్ల కుక్కలు అక్కడే ఉంటున్నాయని అంటున్నారు. దీనిపై జీవీఎంసీ అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించాలని, పట్టుకొని షెల్టర్ కు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

విశాఖపట్నం

పర్యావరణాన్ని కాపాడండి.. మట్టి గణపతినే పూజించండి – లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వినాయక విగ్రహాల పంపిణీ

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. లారస్ ల్యాబ్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులకు పర్యావరణ హితమైన మట్టి గణపతి బొమ్మలను అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని, ప్రజలకు విగ్రహాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చి మట్టి వినాయక విగ్రహాలను తీసుకెళ్లారు. లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు. Uploaded Video:

విశాఖపట్నం

APCOB 4వ బోర్డు సమావేశం – కీలక నిర్ణయాలకు ఆమోదం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (APCOB) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 4వ బోర్డు సమావేశం విజయవాడలోని సహకార భవన్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ DCCB చైర్మన్ కోన తాతారావు ప్రొఫెషనల్ డైరెక్టర్లు, NABARD CGM సోమనిందర్ సింగ్ APCOB మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు. *సమావేశంలో సమీక్షించిన అంశాలు:* బ్యాంకు నిధుల స్థితి, పెట్టుబడులు, CRR/SLR సమ్మతి, NABARD రుణాలు, DCCBల రుణ స్థితి, RBI నిబంధనలు, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్, KYC అప్‌డేషన్ పై సమగ్ర సమీక్ష జరిగింది. *బోర్డు ఆమోదించిన కీలక నిర్ణయాలు:* 1. రెపో రుణ పరిమితిని రూ.200 కోట్ల నుండి రూ.400 కోట్లకు పెంపు. 2. 2026-27కి మెస్సర్స్ రావు & కుమార్ సంస్థను చట్టబద్ధ ఆడిటర్‌గా నియామకం. 3. APCOB ప్రధాన కార్యాలయంలో Central IT Coordination విభాగం ఏర్పాటు. 4. RBI మార్గదర్శకాల మేరకు SHGల NPA వర్గీకరణకు ఆమోదం. 5. APCOB CTIలో శిక్షణ కోసం నలుగురు అధ్యాపకుల నియామకం. 6. APCOB చైర్మన్ గన్ని వీరాంజనేయులు NAFSCOB బోర్డుకు నామినేట్. చివరగా, రైతులకు SAO కింద వ్యవసాయ రుణాలను మరింత పెంచాలని, క్షేత్రస్థాయిలో రుణ ప్రవాహాన్ని బలోపేతం చేయాలని బోర్డు సూచించింది.

విశాఖపట్నం

వెలంపేట స్లమ్ రీ-డెవలప్‌మెంట్‌కు శంకుస్థాపన – 177 కుటుంబాలకు శాశ్వత పరిష్కారం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు వెలంపేట – లక్ష్మీనగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివాస సమస్యలు ఎదుర్కొంటున్న 177 పేద కుటుంబాలకు శాశ్వత పరిష్కారం లభించింది. రాష్ట్రంలోనే తొలి మోడల్ స్లమ్ రీ-డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి . నారాయణ శంకుస్థాపన చేశారు. జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చొరవతో ఈ ప్రాజెక్ట్ సాకారం అయింది. *ప్రాజెక్ట్ వివరాలు:* – *స్థలం:* 55 సెంట్లు – *లబ్ధిదారులు:* 177 కుటుంబాలు – *వ్యయం:* రూ. 28.44 కోట్లు – *నిర్మాణం:* 12 అంతస్తులు (45 మీటర్ల ఎత్తు), ఆధునిక షేర్-వాల్ టెక్నాలజీ – *ఒక్కో యూనిట్ విలువ:* రూ. 16.07 లక్షలు – *గడువు:* 9 నెలల్లో పూర్తి – *నిర్మాణ సంస్థ:* NCC ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన, సురక్షితమైన ఇల్లు ఇవ్వడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని, వెలంపేట మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో మరో 4 స్లమ్స్ అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడిందని, పేదల సొంతింటి కల సాకారం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజు తదితరులు పాల్గన్నారు

విశాఖపట్నం

ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం

గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వార్డు అధ్యక్షులు సాగి సన్యాసి విజయరామరాజు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం (జగన్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వారు అందించిన సంక్షేమాలు, చేసిన అభివృద్ధి ప్రతీ నాయకుడు,కార్యకర్త తన వంతు బాధ్యతగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలనీ . ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో మన నియోజకవర్గాన్ని నిలబెడతారని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ బొట్టా ప్రకాష్, క్లస్టర్ ఇంచార్జ్ సూరిశెట్టి పెంటరావు, బీజేపీ జిల్లా నాయకులు లక్కరాజు సోమరాజు,పి. పెంటయ్య, కె. శ్రీనివాసనాయుడు, తదితరులు పాల్గున్నారు తిరుమల నగర్ అసోసియేషన్, సిద్ధార్థ నగర్ అసోసియేషన్, గణేష్ నగర్ అసోసియేషన్ సభ్యులు పాల్గున్నారు

విశాఖపట్నం

వడ్లపూడి RH కాలనీ, కూర్మన్నపాలెం ప్రజలకు బొండా యల్లాజీ రావు – బొండా శ్రీదేవి నమస్సుమాంజలులు 🙏

మేము గత 41 సంవత్సరాలుగా వడ్లపూడి RH కాలనీ, కూర్మన్నపాలెం పరిసర ప్రాంత ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేశాము. ముఖ్యంగా *స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, మురికివాడల అభివృద్ధి, గణపతి కాలనీ, NTR నగర్, రాజాలమ్మ కాలనీ* సమస్యలపై, అలాగే *రాయల చెరువు పరిరక్షణ* కొరకు నిరంతరం పోరాడాము. ఈ విషయాలన్నీ మీకు విదితమే. గ్రీన్ బెల్ట్ స్థలం కోసం జరిగిన పోరాటంలో మేము అనేక పోలీసు నిర్బంధాలను ఎదుర్కొన్నాము. ఆ సమయంలో యల్లాజీ రావు అండర్ గ్రౌండ్ లో ఉండగా, చంటి పిల్లలతో శ్రీదేవి ఎదుర్కొన్న దయనీయ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం ప్రజా అనుకూల ప్రభుత్వం రావడం వలన, స్థానిక శాసనసభ్యులు మరియు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్న కొందరు ప్రజా ప్రతినిధులు అవినీతికి ఆలవాలంగా మారారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు పక్కకు పోయి, వీరి అవినీతి వలన ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రతి చిన్న పనికి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. భూ కబ్జాలు ఎక్కువై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు, “మీకు అధికారం లేకపోయినా ఇంత సేవ చేశారు, కార్పొరేటర్ గా పోటీ చేస్తే నిస్వార్థంగా అభివృద్ధి చేస్తారని” మాపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల కోరిక మేరకు, రాజకీయాలకు అతీతంగా, సేవా దృక్పథంతో *మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలలో* మా వార్డు నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము. నీతికి, నిజాయితీకి, సేవా దృక్పథానికి పట్టం కట్టి, మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్ గా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. విశ్వగురువుగా భారత్ ను అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేస్తున్న ప్రియతమ ప్రధాని మోదీ నీతివంతమైన పాలనతో గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్న పవన్కళ్యాణ్క, యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా తీసుకొని మేము పని చేస్తాము. గెలిచిన తర్వాత మా ప్రణాళిక, వాగ్దానాలను త్వరలో తెలియజేస్తాము. మేము జీవితాంతం *జీరో బడ్జెట్ పాలిటిక్స్* చేశాము. డబ్బులు ఖర్చుపెట్టి గెలిచి తర్వాత ప్రజలను పీడించే అవసరం మాకు లేదు. ప్రస్తుతం ఎన్నికల ఖర్చుకు కావలసిన ఆర్థిక స్తోమత మా వద్ద లేదు కాబట్టి, *”ఒక నోటు – ఒక ఓటు”* ఇచ్చి మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన విరాళంలో మిగిలిన ప్రతి రూపాయికి లెక్క చెబుతాము. మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోయినా, అవినీతికి పాల్పడినా *రీకాల్ చేసేందుకు అఫిడవిట్* కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. బొండా యల్లాజీ రావు – బొండా శ్రీదేవి

విశాఖపట్నం

గాజువాకలో బీసీ రోడ్డు అభివృద్ధి పనులు – ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తొలగింపు

విశాఖ, గాజువాక: బీసీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా పెదగంట్యాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. విశాఖ నగర మాజీ డిప్యూటీ మేయర్ *దల్లి గోవిందరెడ్డి* దగ్గరుండి ఈ తొలగింపు పనులను పర్యవేక్షించారు. రోడ్డు విస్తరణతో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ, స్థానిక గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, జనసైనికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.